శనివారం, 9 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

27-09-2024 శుక్రవారం దినఫలితాలు : శకునాలు పట్టించుకోవద్దు...

Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
మీ నమ్మకం వమ్ముకాదు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. సన్నిహితులతో సంభాషిస్తారు. పనులు ఒక పట్టాన సాగవు. శకునాలు పట్టించుకోవద్దు. ధైర్యంగా యత్నాలు సాగించండి. ఉద్యోగయత్నం ఫలిస్తుంది. ఉపాధి పథకాలు చేపడతారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఖర్చులు తగ్గించుకుంటారు. మీ శ్రీమతిలో ఆశించిన మార్పు వస్తుంది.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు ముగుస్తాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యాపకాలు సృష్టించుకుంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఖర్చులు అధికం, డబ్బుకు ఇబ్బంది ఉండు. పనులు వేగవంతమవుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతి, పురస్కారయోగం. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సమర్ధతను చాటుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. పదవుల స్వీకరణకు అడ్డంకులు తొలగుతాయి. దుబారా ఖర్చులు విపరీతం. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. పనులు సానుకూలమవుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. దంపతుల మధ్య దాపరికం తగదు.. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఉద్యోగస్తులకు పదవీయోగం, బాధ్యతల మార్పు. కార్మికులు, చేతివృత్తుల వారికి పనులు లభిస్తాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అప్రమత్తంగా ఉండాలి. వ్యతిరేకులతో జాగ్రత్త. పనులు పురమాయించవద్దు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. పత్రాల్లో సవరణలు సాధ్యపడవు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉపాధి పథకాలు చేపడతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
లౌక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. కష్టం ఫలిస్తుంది. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆప్తుల కలయిక వీలుపడదు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ముఖ్యులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
అనవసర విషయాలు పట్టించుకోవద్దు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రభుత్వ కార్యాయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
చేపట్టిన పనులు సాగవు. శకునాలు పట్టించుకోవద్దు. ఓర్పుతో మెలగండి. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కీలక పత్రాలు అందుకుంటారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
రావలసిన ధనం అందుతుంది. అవసరాలు తీరుతాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఉపాధ్యాయులకు పదోన్నతి. కీలక చర్చల్లో పాల్గొంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
రుణ సమస్యలు తొలగుతాయి. ఖర్చులు సామాన్యం. పనులు వేగవంతమవుతాయి. దంపతుల మధ్య సఖ్యత లోపం. చీటికిమాటికి అసహనం చెందుతారు. మీ జోక్యం అనివార్యం. విదేశాల్లోని ఆత్మీయులతో సంభాషిస్తారు. వృత్తి, ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు.