ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

23-09-2024 సోమవారం దినఫలితాలు : ఇతరులకు ధనసహాయం తగదు...

astro1
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆలోచనలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. అన్యమస్కంగా గడుపుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలెదురవుతాయి. సన్నిహితులతో సంభాషిస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యం సిద్ధిస్తుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. కొత్త పనులు చేపడతారు. ధనసహాయం తగదు. ఆరోగ్యం జాగ్రత్త. సంతానం వైఖరి అసహనం కలిగిస్తుంది. సామరస్యంగా మెలగండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వాగ్ధాటితో నెట్టుకొస్తారు. పరిచయాలు బలపడతాయి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. సోదరులను సంప్రదిస్తారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు స్థానచలనం. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యాపకాలు అధికమవుతాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. రావలిసిన ధనం అందుతుంది. ఆప్తులకు సాయం అందిస్తారు. పనులు వేగవంతమవుతాయి. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఖర్చులు విపరీతం. పొదుపు ధనం గ్రహిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రయాణం తలపెడతారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. పనులు సానుకూలమవుతాయి. సోదరీ సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. ఉపాధి పథకాలు చేపడతారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం.. వివాదాలు పరిష్కారదిశగా సాగుతాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
శుభవార్త వింటారు. మీ కృషి ఫలిస్తుంది. అవకాశాలను చేజిక్కించుకుంటారు. పనులు పురమాయించవద్దు. అనుకోని సంఘటనలెదురవుతాయి కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఒత్తిళ్లకు లొంగవద్దు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
మీ ఊహలు నిజమవుతాయి. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు వాయిదా వేసుకుంటారు. పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ఉపాధి పథకాలు చేపడతారు. ప్రైవేట్ ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. మానసికంగా స్థిమితపడతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఆహ్వనం అందుకుంటారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సన్నిహితులతో కాలక్షేపం జేయండి. అతిగా ఆలోచింపవద్దు. రావలసిన ధనం సమయానికి అందదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. కార్మికులకు కష్టసమయం. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మనోధైర్యంతో మెలగండి. యత్నాలు విరమించుకోవద్దు. ఆప్తులను కలుసుకుంటారు. సంతానానికి మంచి జరుగుతుంది. గృహమరమ్మతులు చేపడతారు. పనులు సానుకూలమవుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆర్థికలావాదేవీలు కొలిక్కివస్తాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆప్తులను కలుసుకుంటారు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. పనులు మొక్కుబడిగా పూర్తిచేస్తారు.