బుధవారం, 22 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

24-09-2024 మంగళవారం దినఫలితాలు : యత్నాలు విరమించుకోవద్దు...

astro2
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
యత్నాలు విరమించుకోవద్దు. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. ఖర్చులు తగ్గించుకుంటారు. చెల్లింపుల్లో జాగ్రత్త. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. ప్రలోభాలకు లొంగవద్దు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యం నెరవేరుతుంది. పనులు చురుకుగా సాగుతాయి. అయిన వారితో సంభాషిస్తారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. గృహోపకరణాలు మరమ్మతకు గురవుతాయి. కీలక చర్చల్లో పాల్గొంటారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వ్యవహారానుకూలత ఉంది. అనుకున్నది సాధిస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు మందకొడిగా సాగుతాయి. ధనలాభం ఉంది. కొంతమొత్తం పొదుపు చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మీ జోక్యం అనివార్యం. వాహనం ఇతరులకివ్వవద్దు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. బంధువులతో సంభాషిస్తారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఆందోళన తగ్గి స్థిమితపడతారు. పనులు పురమాయించవద్దు. సంతానం కృషి ఫలిస్తుంది. పుణ్యక్షేత్రం, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మాటతీరు ఆకట్టుకుంటుంది. ప్రముఖులకు సన్నిహితులవుతారు. దుబారా ఖర్చులు విపరీతం. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. కొత్త పనులు చేపడతారు. ఉద్యోగ బాధ్యతలను అలక్ష్యం చేయవద్దు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులను ఆశ్రయించవద్దు. ఆర్భాటాలకు ఖర్చుచేస్తారు. పొగిడేవారితో జాగ్రత్త. ఎవరినీ పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. అప్రియమైన వార్తలు వింటారు. సోదరులను సంప్రదిస్తారు. ప్రయాణం చేయవలసి వస్తుంది. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు ముందుకు సాగవు. ఆలోచనలతో సతమతమవుతారు. పెద్దల సలహా పాటించండి. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేండి. ఖర్చులు విపరీతం. పెట్టుబడులకు తరుణం కాదు. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. మీ జోక్యం అనివార్యం. ధనలాభం, వాహనయోగం ఉన్నాయి. కొందరి రాక అసౌకర్యం కలిగిస్తుంది. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకగ్రత వహించండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1,2,3, 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
మీ వ్యక్తిత్వానికి భంగం కలిగే సూచనలున్నాయి. అనవసర జోక్యం తగదు. సంతాన భవిష్యత్తుపై దృష్టిపెట్టండి. ఒక సమాచారం ఉత్తేజాన్నిస్తుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు సామాన్యం. ధార్మికత పెంపొందుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
బాధ్యతగా మెలగండి. యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. ఓర్పుతో యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు ఒక పట్టాన సాగవు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ముఖ్యుల కలయిక వీలుపడదు. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. వేడుకలో పాల్గొంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. పనులు ఒక పట్టాన సాగవు. చిన్న విషయానికే చికాకుపడతారు. శుభకార్యం నిశ్చయమవుతుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. దైవకార్యంలో పాల్గొంటారు. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది.