ఆదివారం, 6 అక్టోబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

01-10-2024 మంగళవారం దినఫలితాలు : సమస్యలకు పరిష్కారం గోచరిస్తుంది...

Aquarius
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
లక్ష్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. అవకాశాలు చేజారిపోతాయి. పట్టుదలతో యత్నాలు సాగించండి. సన్నిహితుల వ్యాఖ్యలు ఉత్సాహాన్ని రేకెత్తిస్తాయి. కొత్త పనులకు శ్రీకారం చుడుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగ బాధ్యతలపై శ్రద్ధ పెట్టండి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆప్తులకు మీ సమస్యలు తెలియజేయండి. సమస్యలకు పరిష్కారం గోచరిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. కొంతమొత్తం ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. వివాదాలు సద్దుమణుగుతాయి. ఉపాధి పథకాలు చేపడతారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మీ కోపాన్ని తగ్గించుకోండి. ఎవరినీ నిందించవద్దు. కొంతమంది మీ వ్యాఖ్యలు తప్పుపడతారు. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. పత్రాల రెన్యువల్‌ను అలక్ష్యం చేయకండి. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఉద్యోగుల కష్టం ఫలిస్తుంది. పురస్కారాలు అందుకుంటారు. ఖర్చులు విపరీతం. పనులు అనుకున్న విధంగా సాగుతాయి. ఆహ్వానం అందుకుంటారు. వ్యాపారాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆధ్యాత్మికతపై దృష్టి సారిస్తారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. ఫైనాన్స్ వ్యాపారులకు కష్టకాలం. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
సన్నిహితులతో సంభాషణ ఉత్సాహపరుస్తుంది. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుతుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. సంతానం దూకుడు అదుపుచేయండి. సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఓర్పుతో శ్రమిస్తే విజయం తధ్యం. యత్నాలు విరమించుకోవద్దు. పనుల ప్రారంభంలో అవాంతరాలు ఎదుర్కుంటారు. ఖర్చులు సామాన్యం. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. నూతన వ్యాపారాలకు సన్నాహాలు సాగిస్తారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ప్రణాళికలు వేసుకుంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ప్రముఖులకు చేరువవుతారు. మీ జోక్యం అనివార్యం. ఆహ్వానం అందుకుంటారు. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
మాటతీరు ఆకట్టుకుంటుంది. ధనలాభం, వాహనసౌఖ్యం ఉన్నాయి. పరిచయాలు పెంచుకుంటారు. ఖర్చులు అదుపులో ఉండవు. పనులు చురుకుగా సాగుతాయి. పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. ప్రయాణం తలపెడతారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
లావాదేవీలతో తీరిక ఉండదు. పనులు హడావుడిగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. గృహోపకరణాలు మరమ్మతులకు గురవుతాయి. సంతానం వైఖరి చికాకుపరుస్తుంది. ఆప్తులతో సంభాషిస్తారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ధనలాభం ఉంది. కొంతమొత్తం పొదుపు చేస్తారు. సంతానం కృషి ఫలిస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. వివాహయత్నం ఫలిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు పనియందు ధ్యాస ప్రధానం. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
పరిస్థితులు మెరుగుపడతాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. సన్నిహితుల హితవు కార్యోన్ముఖులను చేస్తుంది. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు. వ్యాపారాలు ఊపందుకుంటాయి.