బుధవారం, 22 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : ఆదివారం, 6 అక్టోబరు 2024 (01:05 IST)

06-10-2024 ఆదివారం దిన ఫలాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆదాయం బాగుంటుంది. పనులు వేగవంతమవుతాయి. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
రుణసమస్యలు కొలిక్కివస్తాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఖర్చులు విపరీతం. ఆరోగ్యం బాగుంటుంది. పనులు చురుకుగా సాగుతాయి. ఇంటి విషయాలపై దృష్టిపెడతారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. ప్రయాణం తలపెడతారు.
 
మిధునం :మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. ధనలాభం ఉంది. చెల్లింపుల్లో జాప్యం తగదు. బంధువులతో సంభాషిస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఒక సమాచారం ఊరటనిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఉపాధి పథకాలు చేపడతారు. వాహనం ఇతరులకివ్వవద్దు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఉద్యోగ బాధ్యతల్లో అప్రమత్తంగా ఉండాలి యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. ఖర్చులు అదుపులో ఉండవు. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు సానుకూలమవుతాయి. గృహమరమ్మతులు చేపడతారు. పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. 
 
సింహం మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యక్రమాలు విజయవంతమవుతాయి. మీ కష్టం ఫలిస్తుంది. ధనలాభం ఉంది. విలాసాలకు వ్యయం చేస్తారు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. మీ శ్రీమతిని సంప్రదిస్తారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెంపొందుతుంది. దీక్షలు స్వీకరిస్తారు.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
వ్యవహారాలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం. ప్రముఖుల కలయిక వీలుపడదు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. రావలసిన ధనం అందదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఆప్తుల రాక ఉత్సాహాన్నిస్తుంది. పత్రాలు, ఆహ్వానం అందుకుంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ప్రముఖులతో సంబంధాలు బలపడతాయి. వ్యతిరేకులతో జాగ్రత్త. గుట్టుగా మెలగండి. పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ధనం మితంగా ఖర్చుచేయండి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
మితంగా సంభాషించండి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. మీ మాటలు జారవేసే వ్యక్తులుంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పెద్దమొత్తం ధనసహాయం తగదు. వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. రిటైర్డు ఉద్యోగస్తులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1.2.34 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఓర్పుతో మెలగండి. సంయమనంతో సమస్యలు పరిష్కరించుకోవాలి. భేషజాలకు పోవద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు పురమాయించవద్దు. వ్యాపారంలో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగదు. సన్నిహితుల సలహా పాటించండి. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పనులు ముందుకు సాగవు. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. సభ్యత్వాలు స్వీకరిస్తారు. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ధనం మితంగా ఖర్చు చేయండి. ఆర్భాటాలకు పోవద్దు. సంతానం యత్నాలు ఫలిస్తాయి. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. ఖర్చులు అధికం. ధనసహాయం తగదు. సన్నిహితులతో సంభాషిస్తారు. పనులు వేగవంతమవుతాయి. కీలక వ్యవహారాల్లో జాగ్రత్త. పత్రాల్లో సవరణలు అనుకూలించవు.