సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

21-10-2024 సోమవారం దినఫలితాలు - చిత్తశుద్ధిని చాటుకుంటారు....

astro4
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. పనులు పురమాయించవద్దు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగ బాధ్యతల్లో అశ్రద్ధ తగదు. అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
చిత్తశుద్ధిని చాటుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కీలక బాధ్యతలు స్వీకరిస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. అనవసర జోక్యం తగదు. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మీదైన రంగంలో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త వహించండి. ఎదుటివారు మీ వ్యాఖ్యలను అపార్థం చేసుకుంటారు. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ధనం మితంగా వ్యయం చేయండి. మొహమ్మాటాలలకు పోవద్దు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. గృహమరమ్మతులు చేపడతారు. సోదరులతో సమస్యలెదురవుతాయి. సామరస్యంగా మెలగండి. మీ చొరవతో ఒకరికి మంచి జరుగుతుంది. విందులు, వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పట్టుదలతో యత్నాలు కొనసాగించండి. లౌక్యంగా బాకీలు వసూలు చేసుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. పనుల్లో ఒత్తిడి అధికం. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు. దైవకార్యంలో పాల్గొంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
సన్నిహితుల వ్యాఖ్యలు మీపై సత్‌ప్రభావం చూపుతాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. అయిన వారు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, విశ్రాంతిలోపం. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఖర్చులు విపరీతం. చెల్లింపుల్లో జాగ్రత్త. బంధుత్వాలు బలపడతాయి. సంతానం దూకుడు కట్టడి చేయండి. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. విలాసాలకు వ్యయం చేస్తారు. సంప్రదింపులు ఫలిస్తాయి. నూతన యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను వదులుకోవద్దు. గుట్టుగా మెలగండి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. ధనలాభం, వాహన సౌఖ్యం ఉన్నాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
నిపుణుల సలహా పాటించండి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. సౌమ్యంగా మెలగండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ధనం మితంగా వ్యయం చేయండి. పనుల్లో శ్రమ అధికం. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
పతికూలతలు అధికం. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. దుబారా ఖర్చులు విపరీతం. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ముఖ్యులను కలిసినా ఫలితం ఉండదు. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మీ వాక్కు ఫలిస్తుంది. స్నేహసంబంధాలు బలపడతాయి. ఖర్చులు సంతృప్తికరం. ఆప్తులకు సాయం అందిస్తారు. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఉపాధి పథకాలు చేపడతారు. ఉద్యోగస్తులకు పనిభారం, వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు.