గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

25-10-2024 శుక్రవారం దినఫలితాలు - దంపతులు ఏకాభిప్రాయానికి వస్తారు...

astro7
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు అధికం. ఆర్థికలావాదేవీలతో తలమునకలవుతారు. అనాలోచిత నిర్ణయాలు తగవు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ముఖ్యుల కలయిక వీలుపడదు. దంపతులు ఏకభిప్రాయానికి వస్తారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ధైర్యంగా అడుగు ముందుకేయండి. విమర్శలు పట్టించుకోవద్దు. మీ కృషి ఫలిస్తుంది. వ్యతిరేకించిన వారే మీ సామర్థ్యాన్ని గుర్తిస్తారు. ఖర్చులు విపరీతం. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. కొన్ని విషయాలు చూసీ చూడనట్టు వదిలేయండి.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యంసిద్ధిస్తుంది. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. గృహనిర్మాణాలు ముగుస్తాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సోదరీ సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది. మీ జోక్యం అనివార్యం. ధనలాభం ఉంది. ఖర్చులు భారమనిపించవు. వ్యాపారాభివృద్ధికి శ్రమిస్తారు. ఉద్యోగస్తులకు పనిభారం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆర్థికలావాదేవీలతో సతమతమవుతారు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ప్రలోభాలకు లొంగవద్దు. ఖర్చులు అంచనాలను మించుతాయి. చేబదుళ్లు స్వీకరిస్తారు. పనులు అర్థాంతంగా ముగిస్తారు. దంపతుల మధ్య అకారణ కలహం. సౌమ్యంగా మెలగండి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లొంగవద్దు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ఎంతటివారినైనా ఆకట్టుకుంటారు. బంధుత్వాలు బలపడతాయి. పొదుపు మూలక ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆశావహదృక్పథంతో శ్రమించండి. మీ సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. విమర్శించిన వారే ప్రశంసిస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. బంధుత్వాలు బలపడతాయి. పనులు హడావుడిగా సాగుతాయి. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
మీదైన రంగంలో రాణిస్తారు. కొత్తపరిచయాలేర్పడతాయి. ధైర్యంగా యత్నాలు సాగించండి. మీ కృషి ఫలిస్తుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
వూహాత్మకంగా అడుగులేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది. ఖర్చులు భారమనిపించవు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఓర్పుతో యత్నాలు సాగించండి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. సంప్రదింపులు ఫలిస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మీ నమ్మకం ఫలిస్తుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆహ్వానం అందుకుంటారు. కొందరి రాక చికాకుపరుస్తుంది. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రయాణం చికాకుపరుస్తుంది.