సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

01-11- 2024 శుక్రవారం దినఫలితాలు - ధనలాభం ఉంది.. విలాసాలకు వ్యయం చేస్తారు...

Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. ఖర్చులు సామాన్యం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఆరోగ్యం సంతృప్తికరం. ప్రముఖులకు సన్నిహితులవుతారు. కీలక పత్రాలు అందుకుంటారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
రోజువారీ ఖర్చులే ఉంటాయి. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తిచేస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఇంటి విషయాలపై అపరిచితులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. దైవంలో పాల్గొంటారు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యానుకూలత ఉంది. విమర్శలకు ధీటుగా స్పందిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. అనవసర జోక్యం తగదు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. పత్రాలు అందుకుంటారు. వేడుకకు హజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ప్రణాళికలు వేసుకుంటారు. ధనసహాయం తగదు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. స్నేహ సంబంధాలు మెరుగుపడుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్థల వివాదాలు కొలిక్కివస్తాయి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆలోచనలతో సతమతమవుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. సన్నిహితుల వ్యాఖ్యలు మీ పై సత్ ప్రభావం చూపుతాయి. మొండిగా పనులు పూర్తిచేస్తారు. ఖర్చులు తగ్గించుకుంటారు. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు
ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. కొత్త సమస్యలెదురవుతాయి. ఖర్చులు విపరీతం. ముఖ్యులను కలిసినా ఫలితం ఉండదు.పనులు పురమాయించవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. ప్రయాణం విరమించుకుంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ధనలాభం ఉంది. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. ముఖ్యులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
చాకచక్యంగా వ్యవహరిస్తారు. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. కష్టానికి గుర్తింపు లభిస్తుంది. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు.. బాధ్యతగా మెలగాలి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ఖర్చులు విపరీతం. వస్త్రప్రాప్తి, వస్తులాభం ఉన్నాయి.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లక్ష్యాన్ని సాధిస్తారు. రావలసిన ధనం అందుతుంది. అయిన వారికి సాయం చేస్తారు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ఆహ్వానం అందుకుంటారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. దైవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
చాకచక్యంగా వ్యవహరించాలి. ప్రతికూలతలు అధికం. అవకాశాలు చేజారిపోతాయి. మీ కష్టం మరొకరికి కలిసివస్తుంది. ఖర్చులు విపరీతం. రుణ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడండి. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. చేసిన పనులే చేయవలసి వస్తుంది. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
దుబారా ఖర్చులు విపరీతం. నిస్తేజానికి లోనవుతారు. ఆప్తులతో కాలక్షేపం చేయండి. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లకు లొంగవద్దు. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి. అనుభవజ్ఞులను సంప్రదించండి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
యత్నాలను ఆత్మీయులు ప్రోత్సహిస్తారు. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు సామాన్యం. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. దంపతుల మధ్య అకారణ కలహం. వాహనదారులకు దూకుడు తగదు.