ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

05-11-2024 మంగళవారం ఫలితాలు : కార్యసాధనలో సఫలీకృతులవుతారు...

Rishabham
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. స్నేహసంబంధాలు బలపడతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. పనులు పురమాయించవద్దు. గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
రుణ సమస్యల నుంచి విముక్తులు అవుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి. ఖర్చులు అధికం. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఖర్చులు అంచనాలను మించుతాయి. చెల్లింపుల్లో జాగ్రత్త. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆప్తులతో సంభాషిస్తారు. నిలిపివేసిన పనులు పునఃప్రారంభిస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. వ్యవహారాల్లో జాగ్రత్త. అనుభవజ్ఞుల సలహా పాటించండి.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యసాధనకు మరింత శ్రమించాలి. సమర్ధతకు గుర్తింపు ఉండదు. అందరితోను మితంగా సంభాషించండి. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. పెద్దల చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
రుణ ఒత్తిళ్లు ఆందోళన కలిగిస్తాయి. అన్యమస్కంగా గడుపుతారు. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై సత్ప్రభావం చూపుతాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలను వదులుకోవద్దు. కొత్తవ్యక్తులతో జాగ్రత్త. దంపతుల మధ్య సఖ్యత లోపం. సంయమనంతో మెలగండి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహార పరిజ్ఞానంతో నెట్టుకొస్తారు. ధనలాభం ఉంది. ఖర్చులు తగ్గించుకుంటారు. ప్రముఖులకు సన్నిహితులవుతారు. వ్యాపకాలు అధికమవుతాయి. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు సాగవు. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఖర్చులు సంతృప్తికరం. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. తొందరపాటు నిర్ణయాలు తగదు. పెద్దల సలహా పాటించండి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. సంప్రదింపులు ఫలిస్తాయి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. పనులు సాగవు. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. దంపతుల మధ్య అకారణ కలహం. ప్రయాణం విరమించుకుంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కష్టించినా ఫలితం అంతంత మాత్రమే. సమర్ధతకు గుర్తింపు ఉండదు. యత్నాలు కొనసాగించండి. దుబారా ఖర్చులు విపరీతం. కీలక వ్యవహారాలతో తలమునకలవుతారు. జాగ్రత్త. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. విందులు, వేడుకకు హాజరవుతారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆందోళన కలిగించిన సద్దుమణుగుతుంది. పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. సన్నిహితులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
రోజువారీ ఖర్చులే ఉంటాయి. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. అనవసర జోక్యం తగదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పనులు వేగవంతమవుతాయి. ధార్మికత పెంపొందుతుంది. ఆలయాలు, సేవాసంస్థలకు విరాళాలు అందిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.