బుధవారం, 4 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

09-11-2024 శనివారం రాశిఫలాలు - ఆచితూచి అడుగేయాలి.. సాయం ఆశించవద్దు...

simha raasi
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆచితూచి అడుగేయాలి. సాయం ఆశించవద్దు. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. పనులు మొండిగా పూర్తిచేస్తారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
దృఢసంకల్పంతో యత్నాలు సాగిస్తారు. పెద్దల ప్రోత్సాహం ఉంటుంది. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. శ్రమతో కూడిన ఫలితాన్ని పొందుతారు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కీలక అంశాలపై దృష్టి పెడతారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
శుభవార్తలు వింటారు. మీ శ్రమ ఫలిస్తుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. సన్నిహితులతో సంభాషిస్తారు. జరుపుతారు. మీ శ్రీమతి చొరవతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ప్రతికూలతలు అధికం. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. అన్యమస్కంగా గడుపుతారు. దంపతుల మధ్య అకారణ కలహం. చేసిన పనులు మొదటికే వస్తాయి. ఓర్పుతో యత్నాలు సాగించండి. పిల్లల కదలికలపై దృష్టి సారించండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆత్మీయుల వ్యాఖ్యలు మీపై సత్‌ప్రభావం చూపుతాయి. ఉత్సాహంగా ముందుకు సాగుతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఖర్చులు సామాన్యం. దైవకార్యంలో పాల్గొంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. మాట నిలబెట్టుకుంటారు. బంధుమిత్రులకు మీపై ప్రత్యేకాభిమానం కలుగుతుంది. ఆహ్వానం అందుకుంటారు. ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం అందుతుంది. పనులు హడావుడిగా సాగుతాయి. ప్రయాణం తలపెడతారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. రావలసిన ధనం అందుతుంది. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. పనులు వేగవంతమవుతాయి. ఖర్చులు అధికం. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అనుకూల వాతావరణం నెలకొంటుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. పనులు వేగవంతమవుతాయి. గృహమరమ్మతులు చేపడతారు. పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. వ్యవహారాల్లో తప్పటడుగువేస్తారు. ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. వాయిదా పడిన మొక్కులు చెల్లించుకుంటారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యసిద్ధికి సంకల్పబలం ముఖ్యం. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఖర్చులు తగ్గించుకుంటారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. పనులు అర్ధాంతంగా నిలిపివేస్తారు. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
లక్ష్యాన్ని సాధిస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. కొంతమొత్తం పొదుపు చేస్తారు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
దూకుడుగా వ్యవహరిస్తారు. మీ వైఖరి వివాదాస్పదమవుతుంది. లౌక్యంగా మెలగాలి. ఖర్చులు అధికం. సంతృప్తికరం. పనులు వేగవంతమవుతాయి. ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. కీలక చర్చల్లో పాల్గొంటారు.