శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

14-11-2024 గురువారం ఫలితాలు - ధనలాభం, వాహన సౌఖ్యం ఉన్నాయి...

astro3
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆచితూచి అడుగేయాల్సిన సమయం. అనవసర జోక్యం తగదు. వివాదాల్లో మీ ప్రమేయం లేకుండా జాగ్రత్త వహించండి. అందరితోను మితంగా సంభాషించండి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2, పాదాలు
చాకచక్యంగా వ్యవహరిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. పనులు సానుకూలమవుతాయి. దైవకార్యాలకు వ్యయం చేస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆప్తులకు మీ సమస్యలు తెలియజేయండి. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కీలక చర్చల్లో పాల్గొంటారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఖర్చులు సామాన్యం. కొంతమొత్తం పొదుపు చేస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. నిర్దిష్ట ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు. మీ శ్రమ ఫలిస్తుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నగదు చెల్లింపుల్లో జాగ్రత్త. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. పెద్దల సలహా పాటిస్తారు. ధనలాభం, వాహన సౌఖ్యం ఉన్నాయి. ఖర్చులు అధికం, క్రొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అపోహలకు తావివ్వవద్దు. పనులు వేగవంతమవుతాయి. ముఖ్యులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆలోచనల్లో మార్పు వస్తుంది. కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. ఖర్చులు తగ్గించుకుంటారు. పరిచయాలు బలపడతాయి. ఆహ్వానం అందుకుంటారు. పనులు ఒక పట్టాన సాగవు. సంప్రదింపులతో తీరిక ఉండదు. అనవసర విషయాలు పట్టించుకోవద్దు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
నిపుణుల సలహా పాటించండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. ఖర్చులు విపరీతం. ఓర్పుతో శ్రమించిన గాని పనులు కావు. అప్రియమైన వార్త వింటారు. మీ శ్రీమతిలో మార్పు వస్తుంది. కార్యక్రమాలు వాయిదా పడతాయి, ప్రయాణం తలపెడతారు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు ఫలించవు. అన్యమస్కంగా గడుపుతారు. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. సన్నిహితులతో సంభాషిస్తారు. ఆశావహదృక్పథంతో మెలగండి. పనులు సాగవు. సోదరులతో విభేదిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. దైవకార్యాంలో పాల్గొంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ధనలాభం ఉంది. ప్రణాళికలు వేసుకుంటారు. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. అపరిచితులతో మితంగా సంభాషించండి. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ప్రణాళికలు వేసుకుంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. మాటతీరు అదుపులో ఉంచుకోండి. కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. ఆప్తులతో సంభాషిస్తారు. కీలక చర్చల్లో పాల్గొంటారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సాహసించి నిర్ణయాలు తీసుకుంటారు. మీ కష్టం వృధా కాదు. రావలసిన ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. సాయం ఆశించవద్దు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. శుభకార్యానికి హాజరవుతారు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి. సాయం ఆశించవద్దు. ఏకాగ్రతతో కార్యక్రమాలు కొనసాగించండి. అవకాశాలను వదులుకోవద్దు. పట్టుదలతో శ్రమించినగాని పనులు కావు. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మనోధైర్యంతో మెలగండి. ఖర్చులు అధికం. సన్నిహితులు హితవు మీపై పనిచేస్తుంది. మానసికంగా కుదుటపడతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. విందులు, వేడుకలకు హాజరవుతారు.