గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 నవంబరు 2024 (15:26 IST)

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం.. రేవంత్ రెడ్డి కారును తనిఖీ చేసిన పోలీసులు (video)

Revanth Reddy
Revanth Reddy
మహారాష్ట్రలో నవంబర్ 20వ తేదీన పోలింగ్ షెడ్యూల్ అయింది. అదే నెల 23వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో కలిపి అదే రోజున కౌంటింగ్‌ నిర్వహించనుంది ఈసీ. ఈ రెండు రాష్ట్రాల్లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేది తేలేది అప్పుడే. మహా వికాస్ అగాఢీ నుంచి మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ఉద్ధవ్ థాకరే హోరాహోరీ ప్రచారం సాగిస్తోన్నారు. 
 
ఈ పరిణామాల మధ్య మహా వికాస్ అగాఢీ తరఫున ఎన్నికల ప్రచార బరిలో దిగారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలుగు ఓటర్లు పెద్ద సంఖ్యలో స్థిరపడిన జిల్లాల్లో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. రోడ్ షోలు, బహిరంగ సభలను నిర్వహించనున్నారు. మహా వికాస్ అగాఢీ అభ్యర్థులతో కలిసి ముమ్మర ప్రచారం సాగించనున్నారు. ఇందులో భాగంగా నాగ్‌పూర్‌కు బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచి చంద్రాపూర్‌కు చేరుకుంటారు. 
 
చంద్రాపూర్ నుంచి తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం రజూరా, దిగ్రాస్, వార్ధాల్లో రోడ్ షోల్లో పాల్గొంటారు. రాత్రికి నాగ్‌పూర్‌కు తిరిగి వస్తారు. అక్కడే బస చేస్తారు.
 
ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది.. ఆయన వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 288 నియోజకవర్గాల్లో ఈనెల 20వ తేదీన పోలింగ్ జరగనుంది. 
Revanth Reddy
Revanth Reddy
 
శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో నాగ్ పూర్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. అక్కడి నుంచి చంద్రపూర్ లోని గుగూస్ లో ఏర్పాటు చేసిన సభకు రోడ్డు మార్గం ద్వారా వెళ్తున్నారు. ఈ సమయంలో పోలీసులు రేవంత్ రెడ్డి వాహనాన్ని తనిఖీలు చేశారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి వాహనంలోనే కూర్చొని తనిఖీలకు పోలీసులకు సహకరించారు.