బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 నవంబరు 2024 (11:07 IST)

విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకున్న 'దేవర'

devara movie still
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం దేవర. ఈ చిత్రం సెప్టంబరు 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ కొట్టింది. ఇపుడు ఈ చిత్రం విజయవతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. 
 
సాధారణంగా ఇటీవలి కాలంలో సినిమాలు ఎక్కువ రోజులు థియేటర్లలో ప్రదర్శనలకు నోచుకోవడం లేదు. చాలా సినిమాలు కొన్ని వారాలకు మాత్రమే థియేటర్లకు పరిమితం అవుతున్నాయి. మరికొన్ని చిత్రాలు కొన్ని రోజులు మాత్రమే ఆడుతున్నాయి. కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు తక్కువ రోజుల్లోనే భారీ కలెక్షన్స్ రాబట్టి వెళ్లిపోతున్నాయి. 
 
గతంలో 100 రోజులు, 50 రోజులు థియేటర్లలో ఫలానా సినిమా ప్రదర్శించడం జరిగింది అని ఆయా హీరోల అభిమానులు గొప్పగా చెప్పుకునే వారు. కానీ ప్రస్తుతం అటువంటి మాటలు ఎక్కడా వినిపించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన మూవీ దేవర సినిమా థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుని రికార్డు నెలకొల్పింది. 
 
దీంతో 52 కేంద్రాల్లో ఈ మూవీ 50 రోజులు ప్రదర్శితమైందని తెలియజేస్తూ చిత్ర బృందం పోస్టర్ విడుదల చేసింది. ఎన్ని రోజులు..? ఎన్ని సెంటర్లు? అని సినిమా విజయాన్ని చెప్పుకొనే నాటి రోజులను 'దేవర' గుర్తు చేసినట్లు అయింది. ఓటీటీలో అందుబాటులో ఉన్నప్పటికీ థియేటర్లలో దేవర మూవీ 50 రోజులు పూర్తి చేయడం విశేషంగా పేర్కొంటున్నారు.