బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిన జూనియర్ ఎన్టీఆర్ "దేవర"

devara still
జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం "దేవర". గత నెల 27వ తేదీన విడుదలైంది. గత 16 రోజుల్లో ఈ చిత్రం ఏకంగా రూ.500 కోట్ల మేరకు వసూళ్లను రాబట్టినట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 
 
యాక్షన్ డ్రామా తెరకెక్కిన దేవర చిత్రంలో హీరో ఎన్టీఆర్.. దేవర, వర పాత్రల్లో నటించగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన విషయం తెల్సిందే. సైఫ్ అలీఖాన్ పాత్రను పోషించారు. సెప్టెంబరు 27వ తేదీన విడుదలైంది. ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో అని అందరూ ప్రశంసించారు. దీనికి కొనసాగింపుగా "దేవర 2" చిత్రం రానున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం సీక్వెల్‌పై ఇటీవల కొరటాల శివ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
మొదటిభాగం కంటే రెండో భాగం చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని ఇంటర్వ్యూలో వెల్లడించారు. తొలిభాగంలో చూసింది పది శాతమేనని, రెండో భాగంలో వంద శాంతం చూస్తారన్నారు. ప్రతి పాత్రలో ట్విస్ట్ ఉంటుందని చెప్పారు. అలాగే, హీరో ఎన్టీఆర్ మాట్లాడుతూ, మొదటి భాగం విజయం సాధించడంతో తమ బాధ్యత మరింత పెరిగిందన్నారు. "దేవర" కంటే పార్ట్-2 అద్భుతంగా ఉంటుందని నటుడు శ్రీకాంత్ తెలిపారు.