ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 19 నవంబరు 2024 (17:14 IST)

అల్లు అర్జున్ గురించి నిజాలు బయటపెట్టిన మాత్రుమూర్తి నిర్మల

Nirmala garu, Allu Arjun
Nirmala garu, Allu Arjun
కొడుకు గురించి తల్లికి బాగా తెలుసు. అతని కదలికలు, మనసులోని భావాలు ఇట్టే పసిగడుతుంది. అందులో స్టార్ హీరో అల్లు అర్జున్ తల్లి  నిర్మలగారి గురించి చెప్పనవసరంలేదు. ఆమెకూ కొడుకంటే ఎంతో ప్రేమ. ఇదిలావుండగా, చిరంజీవి కుటుంబంతో అల్లు అర్జున్ కుటుంబానికి తేడాలు వచ్చాయన్నది లోకం ఎరిగిన విషయమే. పవన్ కళ్యాణ్ ఎ.పి ఎన్నికల్లో పాల్గొంటే ప్రత్యర్థి వర్గానికి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడంతో లోకమంతా వారి ఇంటి వ్యవహారాలపై ద్రుష్టి పెట్టింది.
 
తాజాగా అల్లు అర్జున్ పర్సనల్ విషయాలను నందమూరి బాలక్రిష్ణ అన్ స్టాపబుల్ ప్రోగ్రామ్ లో షూట్ చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్, నిర్మలగారితో బాలక్రిష్ణ కొన్ని ప్రశ్నలు సంధించారు. అది ఈనెల 22న ఆహాలో ప్రసారం కానుంది. నేడు చిన్న గ్లింప్స్ ను విడుదలచేశారు. ఈ సందర్భంగా నిర్మల గారు అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ, ఒక విషయం తను అనుకున్నాడంటే అది తప్పో రైటో దానిపైనే స్టిక్ అయివుంటాడు. ఒక్కోసారి అనిపిస్తుంది వీడు ఎవడిమాటైనా వింటే బాగుంటుంది అని.
 
ఎటువంటి పెద్ద విషయాన్నైనా పాజిటివ్ గా తీసుకునే పర్సన్. ఏదైనా జరిగితే ఎందుకు జరిగింది? అనేది కాకుండా.. దాన్నుంచి ఎలా బయటకు వెళ్ళాలనేది చూస్తాడు. దాని దగ్గర ఆడిపోడు. చిరంజీవిగారి సినిమాల100 రోజులు ఫంక్షన్, సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ లు జరిగినప్పుడు బన్నీ కూడా ఇలా అయితే బాగుండు అనుకునేదాన్ని అంటూ మనసులోని మాటను వ్యక్తం చేశారు. దీనిని బట్టి చూస్తే చిరంజీవి తర్వాత అల్లు అర్జున్  ఆ ప్లేస్ కు రావాలనేది మా కోరికగా అనిపిస్తుంది.