సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 19 నవంబరు 2024 (15:52 IST)

రెహమాన్ కు మాట ఇచ్చా అందుకే మాలలో వున్నా వచ్చా : రామ్ చరణ్

Ramcharan at kadapa darga
Ramcharan at kadapa darga
గత కొద్దిరోజులుగా రామ్ చరణ్ కడప దర్గాకు వస్తున్నారని ప్రచారం చేయడం తెలిసిందే. 80వ నేష‌న‌ల్ ముషాయ‌రా గ‌జ‌ల్ ఈవెంట్‌ను ఈ నెల 18న క‌డ‌పలోని అమీన్ పీర్‌ ద‌ర్గాలో నిర్వ‌హించ‌నున్నారు. ఈ వేడుక‌కు ముఖ్య అతిథిగా గ్లోబల్ స్టార్ శ్రీ రామ్‌చ‌ర‌ణ్ హాజ‌రు కానున్నారు. అనుకున్నట్లుగానే రామ్ చరణ్ హాజరయ్యారు. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు వస్తున్నాయి. మాలతో వున్నవారు అలా వెళ్ళవచ్చా? మరీ ఇంత లౌకివాదమా? మెగాస్టార్ కొడుకువాడు.. అంటూ వివిధ రకాలుగా పోస్టింగ్ లు పెట్టారు.
 
కాగా, దర్గాను సందర్శించుకున్న ఆయన అక్కడ మాట్లాడుతూ, ఎ.ఆర్. రెహమాన్ గారు ఈ ద‌ర్గాలో జ‌రిగే కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావాలంటూ మూడు నెల‌ల ముందే ఆహ్వానించారు. వ‌స్తాన‌ని ఆయ‌న‌తో అన్నాను. ఆయ‌న‌కు ఇచ్చిన మాట కోసం, మాల‌లో ఉన్నా కూడా ఈ ద‌ర్గాకు వ‌చ్చాను. ఇందులో తప్పొప్పులు పట్టడానికి ఏమీలేదు. మనసుపవిత్రంగా చేసుకుని వచ్చా అంటూ తెలిపారు. కడప అమీన్ పీర్ దర్గా గొప్ప చరిత్ర మరియు ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందిన ఒక ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశం.  అటువంటి కార్యక్రమాన్నికి మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొనడం ఎంతో గౌరవప్రదమైన విషయం అక్కడి ఇమాన్ లు తెలిపారు.