నోరు అదుపులో పెట్టుకోకుంటే జగన్‌నే ప్రజలు చెప్పుతో కొడతారు : కామినేని
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా నోరు అదుపులోకి పెట్టుకోకుంటే ప్రజలే ఆయనను చెప్పులతో కొట్టే పరిస్థితి వస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ హెచ్చరించారు.
శనివారం తిరుపతి రైల్వేస్టేషన్‌లోతిరుచానూరు క్రాసింగ్ స్టేషన్ శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసలు జగన్‌కు ఏం తెలుసని ప్రశ్నించారు. ఏపీని అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక జగన్ పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.
ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రులలో మెరుగైన వైద్యం అందుతోందని, 85 శాతంకుపైగా ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సిబ్బంది నిరంతరం పనిచేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా, ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు.