శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 12 మే 2017 (10:03 IST)

ప్రధానితో జగన్ భేటీ.. టీడీపీ వెన్నులో వణుకు... కాళ్ల మీద పడటం చూశారా : కావూరి ప్రశ్న

దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఒక రాష్ట్ర ప్రతిపక్ష నేతగా ఉన్న వైకాపా అధినేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి కలవడంలో తప్పేమిటని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు ప్రశ్నించారు.

దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఒక రాష్ట్ర ప్రతిపక్ష నేతగా ఉన్న వైకాపా అధినేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి కలవడంలో తప్పేమిటని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు ప్రశ్నించారు. ఇటీవల ప్రధానితో జగన్ భేటీ కావడాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా తప్పుబడుతూ.. విమర్శలు గుప్పించిన విషయం తెల్సిందే.
 
వీటిపై బీజేపీ నేతగా ఉన్న కావూరి సాంబశివరావు స్పందిస్తూ... దేశ ప్రధాని నరేంద్ర మోడీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత.... అధికార పార్టీ చేతిలో కేవలం రెండు శాతం ఓట్లతో ఓటమిపాలైన వైఎస్సార్సీపీ అధినేత కలవడంలో వింత ఏమిటో తనకు అర్థం కావడం లేదన్నారు. 
 
టీడీపీ నేతలు దీనిని ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారో తనకు తెలియడం లేదని ఆయన చెప్పారు. భారతదేశంలోని ఏ పౌరుడైనా ప్రధాని అపాయింట్ మెంట్ ఇస్తే కలవవచ్చని ఆయన అన్నారు. అలాంటిది ఒక రాష్ట్ర ప్రతిపక్ష నేత ప్రధానిని కలవడంలో వింత ఏముందని ఆయన అడిగారు. జగన్ ప్రధాని కాళ్ల మీద పడడం ఏ టీడీపీ నేత చూశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.