1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (10:57 IST)

పాశర్లపూడిలో కోనసీమ జలవిహారి బోటు

తూర్పుగోదావరి జిల్లా వైనతేయ నదిలో అందాలను ఆస్వాదించడానికి పాశర్లపూడిలో రూ.1.20 కోట్లతో కోనసీమ జలవిహారి బోటును పర్యాటకుల కోసం ఏర్పాటుచేశారు. పాశర్లపూడిలో నిర్మించిన బోటింగ్‌ పాయింట్‌ వద్ద ఈ కోనసీమ జలవిహారి బోటును ప్రారంభించారు.

30 మంది పర్యాటకులు కూర్చుని ప్రయాణించే విధంగా సీట్లు ఏర్పాటు చేసి, ఏసీతోపాటు ప్రయాణికుల రక్షణ కోసం వివిధ రకాల ఏర్పాట్లు చేశారు. బోటింగ్‌ పాయింట్‌ నుంచి ఆదుర్రు ఆది బౌద్ధ స్థూపం వరకు షికారు చేసేందుకు ఒక ప్యాకేజిను, అప్పనపల్లి బాలబాలాజీస్వామి ఆలయం వరకు మరో ప్యాకేజిను అందుబాటులోకి తెచ్చారు.

అంతేకాకుండా వైనతేయ నది పరిసర ప్రాంతాల్లో పదిహేను నిమిషాలు విహరించేలా మూడో ప్యాకేజిని ఏర్పాటు చేసినట్టు ఏపీ టూరిజం ఏఈ వై.సత్యనారాయణ తెలిపారు.

మొదటి ప్యాకేజిలో రెండు గంటల విహారానికి రూ.8,260, రెండో ప్యాకేజిలో మూడు గంటలకు రూ.10,620, మూడో ప్యాకేజిలో పదిహేను నిమిషాలకు గాను మనిషికి రూ.90 ధరగా నిర్థారించినట్టు తెలిపారు.

ఈ పాయింటు వద్ద స్పీడు బోట్లను త్వరలో ఏర్పాటు చేస్తామని, ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నట్టు ఏఈ తెలియజేశారు.