శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (10:27 IST)

తిరుపతిలో తెలుగు అకాడమీ, సాంస్కృతిక యూనివర్సిటీ: లక్ష్మీపార్వతి

తిరుపతిలో తెలుగు అకాడమీ, సాంస్కృతిక యూనివర్సిటీ నెలకొల్పనున్నట్లు తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌ నందమూరి లక్ష్మీపార్వతి చెప్పారు. తెలుగు అకాడమీ పుస్తకాల ముద్రణను పున:ప్రారంభించనునట్లు తెలిపారు.

వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికే ఇంటర్మీడియేట్‌ పాఠ్యపుస్తకాలను అకాడమీ ముద్రించి విద్యార్థులకు అందుబాటులో ఉంచుతుందన్నారు. తరువాత ఎంసెట్‌ పుస్తకాలను అందుబాటులోకి తీసుకొస్తామని, మిగిలిన పుస్తకాలను దశలవారీగా ముద్రిస్తామని చెప్పారు.

అకాడమీ పుస్తకాలు అందుబాటులోకి లేకపోవడంతో ప్రైవేట్‌ కళాశాలలు సొంతంగా పుస్తకాలు ముద్రించి అధిక ధరకు విక్రయిస్తున్నాయని తెలిపారు. దీనివల్ల విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.

రాష్ట్రవిభజన తరువాత తెలుగు అకాడమీకి రావాల్సిన నిధులు, ఇతర అంశాలను గత ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. తమ ప్రభుత్వం అకాడమీ నిధులు, భవనాలు విషయంలో కోర్టును ఆశ్రయించిందని తెలిపారు.

అకాడమీ నిధులు, భవనాలను రాష్ట్రానికి 58:42 నిష్పత్తిలో రెండు నెలల్లో పంపకాలు చేసుకోవాలని కోర్టు వారం క్రితం తీర్పునిచ్చిందన్నారు.

అదేవిధంగా పుస్తకాల ముద్రణ కోసం రూ.30కోట్లు ఇవ్వాలని తెలంగాణ తెలుగు అకాడమీకి ఇటీవల లేఖ రాశామని, దీనిపై ఇంతవరకు సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. తిరుపతిలో తెలుగు అకాడమీ, సాంస్కృతిక యూనివర్సిటీ నెలకొల్పనున్నట్లు తెలిపారు.