ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (12:49 IST)

తిరుపతిలో ఇంటిగ్రేటెడ్‌ బస్‌స్టేషన్‌!

తిరుపతిలో ఇంటిగ్రేటెడ్‌ (సకల హంగులతో కూడిన) బస్‌స్టేషన్‌ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరమయ్యాయి. దీన్ని ప్రస్తుతం తిరుపతి సెంట్రల్‌ బస్టాండు ఉన్న ప్రాంతంలో (13ఎకరాల స్థలంలో)నే నిర్మించనున్నట్లు సమాచారం.

ఈ అంశంపై ఇదివరకే ఓ కమిటీ కూడా పర్యటించి నివేదికను సిద్ధం చేసింది. ఈ బస్‌స్టేషన్‌ నిర్మాణం చేపడితే ప్రత్యామ్నాయంగా తాత్కాలిక బస్టాండ్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తొలిసారిగా నగరానికి వచ్చిన ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్‌ కూడా ఎక్కువ సమయం తాత్కాలిక బస్టాండ్ల కోసం అవసరమైన స్థల పరిశీలనపై దృష్టి పెట్టారు.

ఇందులో భాగంగా.. ఆదివారం తిరుచానూరురోడ్డులోని పద్మావతి కల్యాణమండపాల ఎదురుగా ఉన్న హథీరాంజీ మఠం భూముల్లో తాత్కాలిక బస్టాండు ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు. ప్రయాణికులకు అనుకూలంగా ఉండేలా తాత్కాలిక బస్టాండ్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.