ఫిబ్రవరి1 నుంచి తిరుపతి- చెన్నైకి ప్రత్యేక రైలు

train
ఎం| Last Updated: గురువారం, 28 జనవరి 2021 (11:58 IST)
డాక్టర్‌ ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ నుంచి తిరుపతి, జోలార్‌పేటకు ప్రత్యేక రిజర్వేషన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది.

చెన్నై సెంట్రల్‌ నుంచి ప్రత్యేక రైలు (నెంబరు.. 06095) ఫిబ్రవరి 1 నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం 2.15 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుపతి నుంచి ఈ ప్రత్యేక రైలు (06096) ఫిబ్రవరి 1 నుంచి ప్రతిరోజు సాయంత్రం 6.10 గంటలకు బయల్దేరి రాత్రి 10 గంటలకు చెన్నై సెంట్రల్‌ చేరుకుంటుంది.

తిరువళ్లూరు, అరక్కోణం, తిరుత్తణి, ఏకాంబరకుప్పం, పుత్తూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి. తిరుపతి-చెన్నై సెంట్రల్‌ (06096) ప్రత్యేక రైలు అంబత్తూర్‌, పెరంబూర్‌ స్టేషన్‌లలో ఆగుతుంది.
దీనిపై మరింత చదవండి :