శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 26 సెప్టెంబరు 2018 (10:11 IST)

మళ్లీ కాంగ్రెస్ గూటికి కొండా సురేఖ... పూర్వ వైభవం దక్కేనా?

వరంగల్ జిల్లాలో మంచిపట్టున్న నేతలుగా పేరొందిన కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళిలు తిరిగి సొంతగూటికి చేరనున్నారు. వారిద్దరూ బుధవారం తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు.

వరంగల్ జిల్లాలో మంచిపట్టున్న నేతలుగా పేరొందిన కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళిలు తిరిగి సొంతగూటికి చేరనున్నారు. వారిద్దరూ బుధవారం తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. ఢిల్లీలో కొండా దంపతులు కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌ను కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది.
 
మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన కొండా సురేఖ... సాయంత్రానికి ఢిల్లీ చేరుకున్నారు. బుధవారం ఉదయం గులాం నబీ ఆజాద్‌తో వీరిద్దరూ సమావేశంకానున్నారు. ఆజాద్‌తో భేటీ అనంతరం మధ్యాహ్నం సమయంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ సమక్షంలో వారు కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. 
 
ఇదిలావుంటే కొండా సురేఖ సొంతనియొజకవర్గమైన పరకాల నుంచి పోటీ చేస్తారా? లేక వరంగల్‌ తూర్పు నుంచి నిలబడతారా? అలాగే సురేఖతో పాటు ఆమె కూతురు సుష్మితా పటేల్‌ కూడా ఎన్నికల బరిలోకి దిగుతారా? అనేది ఇపుడు చర్చనీయాంశంగా మారింది.