శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: బుధవారం, 12 సెప్టెంబరు 2018 (19:42 IST)

ఉండవల్లీ... మీకోసం వినాయక చవితి అయినా ఎదురుచూస్తుంటా... కుటుంబరావు

తానెప్పుడూ సచివాలయంలోనే ఉంటానని, పార్లమెంట్ మాజీ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన ఆరోపణలపై చర్చకు రేపు అయినా రెడీ అని ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు స్పష్టం చేశారు. అమరావతి బాండ్ల జారీలో రూపాయి అవినీతి జరిగినట్లు నిరూపిస్తే తాను రాజీనామ

తానెప్పుడూ సచివాలయంలోనే ఉంటానని, పార్లమెంట్ మాజీ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన ఆరోపణలపై చర్చకు రేపు అయినా రెడీ అని ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు స్పష్టం చేశారు. అమరావతి బాండ్ల జారీలో రూపాయి అవినీతి జరిగినట్లు నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమేనని సవాల్ విసిరారు. మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్‌కు ఏ వివరాలు కావాలన్నా ఇస్తామని, ఆ తరవాత కూడా చర్చకు రావొచ్చునని ఆయన తెలిపారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 
 
రెండు వారాల నుంచి మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన ఆరోపణలకు పదే పదే సమాధానాలు ఇస్తున్నా కూడా ఇంకా అనుమానాలు వెల్లడించడం చాలా బాధాకరమన్నారు. మంగళవారం కూడా ఆయన అమరావతి బాండ్ల ఇష్యూలో ఎక్కువ వడ్డీ చెల్లించారన్నారు. గతంలోనూ చెప్పా, ఇపుడే అదే చెబుతున్నా...తామిచ్చిన వడ్డీ కంటే తక్కువ వడ్డీ ఇస్తే, డబుల్ అరేంజర్ ఫీ ఇస్తామని సవాల్ విసిరారు. తాము .85 అరెంజర్ ఫీ ఇచ్చాం, తక్కువ వడ్డీకి ఎవరు తీసుకొచ్చినా 1.70 అరెంజర్ ఫీ ఇస్తామన్నారు. ఇప్పటికే ఎన్నో పర్యాయాలు చెప్పా, ప్రభుత్వ సంస్థయినా, ప్రైవేటు సంస్థయినా బాండ్ల ఇష్యూ చేస్తే  ఆయా సంస్థల రేటింగ్ ఆధారంగా వడ్డీ రేట్లు నిర్ణయిస్తారు. 
 
ఇదే విషయం వర్షాకాల అసెంబ్లీ సమావేశల్లోనూ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ట్రిపుల్ ఎ+, ట్రిపుల్ ఎ, ట్రిపుల్ ఎ - ఇవీ అత్యధిక రేటింగ్ లని ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు తెలిపారు. ఆ తరవాత డబుల్ ఎ ప్లస్, డబుల్ ఎ, డబుల్ ఎ  మైనస్ ఉంటాయన్నారు. ఎ ప్లస్, ఎ, ఎ మైనస్.. ఇలా రేటింగ్ లు ఉంటాయన్నారు. తక్కువ వడ్డీ ట్రిపుల్ ఎ కంపెనీలకు, ప్రభుత్వ రంగ సంస్థలకు వస్తాయన్నారు. తరవాత వడ్డీ పెరిగి డబుల్ ఎ సంస్థలకు వస్తాయన్నారు. భారత దేశం రేటింగ్ ఇంకా ట్రిపుల్ బి దగ్గర ఉంది. వారం రోజుల నుంచి రుపాయి.. డాలర్‌కు 72.85 పైసలకు పడిపోయింది. దీంతో  ఎప్పుడూ లేనివిధంగా కేంద్ర ప్రభుత్వ బాండ్ల వడ్డీ కూడా పెరిగిపోయింది. 
 
అమరావతి బాండ్లు జారీ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వ బాండ్ల వడ్డీ 7.35గా ఉందని, ఇపుడు వాటి వడ్డీ 8.18కు పెరిగిందని ఆయన తెలిపారు. నేడు అమరావతి బాండ్లను 10.32 వడ్డీకి ఇష్యూ చేశామన్నారు. దీనికంటే ఎవరైనా తక్కువ వడ్డీ రేటుకు తీసుకొస్తే, అరేంజర్ ఫీ డబుల్ ఇస్తామన్నారు. ఇప్పటికైనా ఎక్కువ వడ్డీ రేటు ఇచ్చామనడం సరికాదు. సీఆర్డీయే రేటింగ్ ఎ ప్లస్ ఉందని, ఆ విధంగానే వడ్డీ రేటు నిర్ణయించారని తెలిపారు. ఏడాది నుంచి వడ్డీ రేట్లు పెరుగుతున్నాయన్నారు. ఈ ఏడాది రెండు పర్యాయాలు వడ్డీ రేట్లు పెరిగాయన్నారు. ఇవేవీ మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ కు తెలియనది కాదని, ఆయనకు ఆర్థికాంశాలపై విశేష అహగాహన ఉందని అన్నారు. 
 
అడ్వయిజర్, అరేంజర్ ఫీలు వేర్వేరు ఉంటాయన్నారు. సీఆర్డీయే అడ్వయిజర్ గా రూపాయికే ఏకే క్యాపిటల్ కోడ్ వేయడంతో ఓకే చేశామన్నారు. అరేంజర్ ఫీజుకు .85 కు ఏకే క్యాపిటల్ కోడ్ చేయడంతో అదే కంపెనీకి ఓకే చేశామన్నారు. ఇది చాలా తక్కువన్నారు. గుజరాత్ లో ప్రధాని నరేంద్రమోడి ముద్ద బిడ్డ గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్ 1.75 చెల్లించారన్నారు. తాము అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలిచ్చిన విధంగానే అరేంజర్ ఫీ చెల్లించామన్నారు. వడ్డీ రేటు, అరేంజర్ ఫీ ఎక్కువ చెల్లించలేదన్నారు.
 
పనులు చేయకుండానే బిల్లులు చెల్లించామని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించడం సరికాదని ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు అన్నారు. పనులు జరకుండా ఎవరూ బిల్లులు చెల్లించరన్న విషయం ఆయనకు తెలియనిది కాదన్నారు. పదేళ్లుగా ఎంపీ గా ఉన్న ఆయన బిల్లులు ఏవిధంగా మంజూరు చేస్తారో ఆయన తెలుసన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన పోలవరం ప్రాజెక్టు అథార్టీ తప్పు చేసిందా అని ఆయన ప్రశ్నించారు. ప్రజల్లో లేనిపోని అపోహాలు కలిగేలా మాజీ ఎంపి ఉండవల్లి అరుణకుమార్ లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
 
పట్టిసీమ ప్రాజెక్టుకు అదనపు చెల్లింపులు చేశామని మాజీ ఎంపి ఆరోపించడం సరికాదని ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు అన్నారు. అదనపు చెల్లింపులకు ఏ కాంట్రాక్టర్ అయినా బిడ్ చేయొచ్చు. ఉండవల్లి అరుణ్ కుమార్ స్నేహితులు, వైసీపీ నేతలకున్న సంస్థలు ఎందుకు బిడ్ చేయలేదని ప్రశ్నించారు. అనుకున్న లక్ష్యంలోగా ప్రాజెక్టులను పూర్తి చేసిన సంస్థలను అభినందించాల్సి ఉంది. ప్రాజెక్టులు ఆలస్యమైతే ఎంతో వ్యయమవుతుందన్నారు. పట్టిసీమ అనుకున్న సమయానికి పూర్తి చేయడం వల్ల కృష్ణా డెల్టా పరిధిలో వేల కోట్ల రూపాయల విలువైన పంటలు సాగయ్యాయన్నారు. ఇవన్నీ ఆయన గుర్తించుకోవాలన్నారు. ఏది మంచి...ఏది చెడు అని గుర్తించాలన్నారు. పట్టిసీమ ప్రాజెక్టుపైనా చర్చకు తాను సిద్ధమేనన్నారు.
 
పేదల అపార్టుమెంట్ల నిర్మాణంపై అసెంబ్లీ పూర్తిస్థాయిలో చర్చ జరిగందని అని ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు తెలిపారు. బీజేపీ సభ్యులు కూడా ఆ చర్చలు పాల్గొన్నారన్నారు. అసెంబ్లీ చర్చను చూసుంటే, మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ కు కావాల్సిన అన్ని వివరాలు లభిస్తాయన్నారు. ఇండస్ట్రీయల్ వెబ్ సైట్‌లో రాష్ట్రంలో జరిగిన ఎంవోయూలు, వచ్చిన పెట్టుబడులు, ఎన్ని ఉద్యోగాలు లభించాయన్న వివరాలు ఉంటాయని అని ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు తెలిపారు. 
 
విశాఖలో జరిగిన భాగస్వామ్య సమిట్ లో రూ.18 లక్షల కోట్ల విలువైన ఎంవోయూలు ఏమయ్యాయని మాజీ ఎంపి అరుణ్ కుమార్ అడుగుతున్నారన్నారు. ఏపీ స్టేట్ ఇండస్ట్రీయల్ వెబ్ సైట్ పరిశీలించినా, కావాలంటే తాను కూడా పూర్తి వివరాలు అందిస్తానని తెలిపారు. రాష్ట్ర  ప్రభుత్వ పారిశ్రామికా విధానాలు నచ్చి, ఎందరో పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నారన్నారు. చేసుకున్న ఒప్పందాల్లో ఏర్పాటవుతున్న పరిశ్రమల రేటింగ్ ఏపీలో 38.42 శాతంగా ఉందన్నారు. దేశంలో ఇదే అత్యధికమన్నారు. వివిధ దేశాలతో కేంద్ర ప్రభుత్వం చేసుకున్న వివిధ ఎంవోయూల్లో 17, 18 శాతం మాత్రమే ఉందన్నారు. ప్రజల్లో అపోహాలు కలిగేల మాట్లాడడం సరికాదన్నారు.