మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 3 సెప్టెంబరు 2018 (15:01 IST)

పెద్దమ్మ తల్లి సాక్షిగా గుండు చేయించుకుంటా.. బహిరంగంగా ప్రకటించిన నటుడు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) నిధులను దుర్వినియోగం అయినట్టు ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తలపై మా అధ్యక్షుడు శివాజీ రాజా స్పందించారు. ఈ సంస్థకు చెందిన నిధుల్లో ఒక్క పైసా కూడా దుర్వినియోగం జరిగినట్టు ని

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) నిధులను దుర్వినియోగం అయినట్టు ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తలపై మా అధ్యక్షుడు శివాజీ రాజా స్పందించారు. ఈ సంస్థకు చెందిన నిధుల్లో ఒక్క పైసా కూడా దుర్వినియోగం జరిగినట్టు నిరూపిస్తే తమ సభ్యత్వాలను రద్దు చేసుకోవడమేకాకుండా, పెద్దమ్మ తల్లి సాక్షిగా గుండు గీయించుకుంటానంటూ ఆయన ప్రకటించారు.
 
'మా' అధ్యక్షుడిగా ఉన్న శివాజీ రాజా ఆ సంఘం నిధులను మింగేశాడని, మెగా ఈవెంట్‌తో వచ్చిన నిధి నుంచి కొంత దుర్వినియోగం చేశాడని ఓ ఆంగ్ల పత్రికలో ఓ కథనం వచ్చింది. దీనిపై ఫిల్మ్‌నగర్‌లో హాట్ హాట్‌గా చర్చ సాగుతోంది. ఈ ఆరోపణలపై శివాజీరాజాతో పాటు హీరో శ్రీకాంత్ స్పందించారు. 'మా' రజతోత్సవంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఒకవేళ అవకతవకలు జరిగాయని నిరూపిస్తే తమ సభ్యత్వాన్ని రద్దు చేసుకుంటామన్నారు. 
 
అంతేకాదు, నిరూపిస్తే పెద్దమ్మ తల్లి సాక్షిగా గుండు చేయించుకుంటానని శివాజీ రాజా సంచలన ప్రకటన చేశారు. త్వరలో 'మా' ఎన్నికలు రాబోతున్నందుకే తమపై ఆరోపణలంటూ ఆవేదన వ్యక్తంచేశారు. అవకతవకలను నిరూపిస్తే రాజీనామా చేస్తానని శ్రీకాంత్ కూడా ప్రకటించారు. చిరంజీవి అతిథిగా వచ్చిన 'మా' రజతోత్సవానికి కోటి రూపాయలు వచ్చాయని, త్వరలో మహేష్‌తో కార్యక్రమం చేపట్టబోతున్నామని పరుచూరి వెంకటేశ్వరరావు వెల్లడించారు.