బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 26 నవంబరు 2016 (08:46 IST)

రెండేళ్ల నుంచి అశ్లీల చిత్రాలు చూపించి లైంగికంగా వేధించిన టీచర్ అరెస్టయ్యాడు..

బాలికలపై వేధింపులు పెరిగిపోతున్నాయి. అత్యాచారాలు, లైంగిక వేధింపులతో చిట్టి తల్లులు కష్టాలు అనుభవిస్తున్నారు. తాజాగా ఎల్బీనగర్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్న ఉపాధ్యాయ

బాలికలపై వేధింపులు పెరిగిపోతున్నాయి. అత్యాచారాలు, లైంగిక వేధింపులతో చిట్టి తల్లులు కష్టాలు అనుభవిస్తున్నారు. తాజాగా ఎల్బీనగర్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్న ఉపాధ్యాయుడిని ఎల్‌బీనగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. త్రివేండ్రం కొట్టరక్కర గ్రామానికి చెందిన సజ్జి మోహన్‌ వర్మ అలియాస్‌ నందు నగరానికి వచ్చి నాగోల్‌ వెంకటరమణ కాలనీలో నివసిస్తున్నాడు. 
 
ఇతడు అరుణోదయ కాలనీలోగల ఒలంపియాడ్‌ స్కూల్‌లో బయాలజీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అతడి వద్దకు ట్యూషన్‌కు వెళ్లే విద్యార్థులకు ట్యాబ్‌లో రెండేళ్ల నుంచి అశ్లీల చిత్రాలు చూపించి లైంగికంగా వేధించాడు. ఈ విషయాన్ని విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. మోహన్ వర్మను అరెస్టు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, పోక్సో చట్టాల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని ఏసీపీ వేణుగోపాలరావు చెప్పారు.