మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 24 మే 2021 (13:55 IST)

మిరప విత్తన బ్లాక్ మార్కెటింగ్ కి చెక్ పెడతాం: మంత్రి కురసాల కన్నబాబు

మిరప రైతుకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడిం చారు. అవసరం మేరకు ఆర్ బి కేల ద్వారా రైతులకు అవసరమైన, డిమాండ్ ఉన్న విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.

కరోనా ఉదృతిని సాకుగా చూపి  కొంత మంది వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నట్టుగా ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. ప్రాచుర్యం కలిగిన ప్రీమియం, హై బ్రీడ్ రకం విత్తనాలను బ్లాక్ మార్కెట్ లో అధిక ధరలకు విక్రయించే  వ్యాపారులు, డిలర్లపై కటిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు.

త్వరలో ఈ రకమైన ప్రాచుర్యం పొందిన విత్తనాలను ఆర్  బి  కె ల ద్వారా సరఫరా చేసేందుకు చర్యలు  తీసుకుంటున్నట్టు తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అనవసరంగా అధిక ధరలకు కొనుగోలు చేసి నష్టపోవద్దని విజ్ఞప్తి చేశారు.

రైతులకు అవసరమైన, డిమాండ్ ఉన్న విత్తనాలను అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు. ప్రస్తుతం అధిక ధరలకు అమ్ముతున్న కొన్ని రకాల  విత్తనాలా కోసం ఎదురు చూడకుండా అదే సెగ్మెంట్ లో అధిక దిగుబడిని ఇచ్చే ఇతర విత్తనాలు వేసేందుకు రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయ అధికారులకు  మంత్రి సూచించారు.