గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (12:01 IST)

జైలు గార్డుల కళ్లలో కారం కొట్టి 16 మంది ఖైదీల పరార్

జైలు గార్డుల కళ్లలో మిరియాల పొడి చల్లి, వారిని కొట్టి జైలు నుంచి 16మంది ఖైదీలు పారిపోయిన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా ఫలోడి సబ్ జైలులో సోమవారం రాత్రి జరిగింది. 
 
జైలు మెస్‌లో ఉన్న మహిళా గార్డుల కళ్లలో కారం కొట్టడంతో వారు కిందపడి గాయపడ్డారు. అనంతరం జైలు గార్డుల కళ్లలో మిరియాల పొడి చల్లి వారిని కొట్టి 16 మంది ఖైదీలు పారిపోయారు.

పారిపోయిన ఖైదీల్లో ముగ్గురు బీహార్ రాష్ట్ర ఖైదీలని, మిగిలిన వారు ఫలోడి, బాప్, లోహవట్ ప్రాంతాలవారని జైలు అధికారులు చెప్పారు. జైలు నుంచి పారిపోయిన ఖైదీలంతా డ్రగ్స్ కేసులో నిందితులని జైలు అధికారులు చెప్పారు