బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Updated : శనివారం, 4 ఏప్రియల్ 2020 (22:28 IST)

రండి దీపాలు వెలిగిద్దాం: గవర్నర్ పిలుపు- చిరంజీవి వీడియో

కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి ఆదివారం ప్రజలందరూ తమ తమ ఇళ్లల్లోని విద్యుత్ లైట్లన్నీ ఆపేసి, జ్యోతులు వెలిగించాలన్న ప్రధాని మోదీ పిలుపు మేరకు రాష్ట్ర ప్రజలంతా ప్రతి స్పందించాలని గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో 9 నిమిషాలపాటు ప్రతి ఒక్కరూ తమతమ ఇళ్లవద్దనే ఉండి ఇళ్లల్లోని విద్యుత్‌ లైట్లన్నీ ఆపేసి, జ్యోతులు వెలిగించి తమ ధృఢ సంకల్పాన్ని వెల్లడించాలన్నారు. 
 
చమురు దీపాలు, కొవ్వొత్తులు, టార్చ్‌లైట్లు, సెల్‌ఫోన్‌ ఫ్లాష్‌లైట్లు ... ఇలా ఏదోక రూపంలో కాంతిని వెలిగించి, కరోనా అనే చీకటి మహమ్మారిని తరిమేద్దాం అన్న సంకల్పం చాటటం అత్యావశ్యకమన్నారు. జనతా కర్ప్యూ స్ఫూర్తిని మరోమారు చాటుతూ, మీ విలువైన సమయంలో ఓ 9 నిమిషాలు దేశం కోసం కేటాయించాలని గవర్నర్ ఆకాంక్షించారు.