Live accident, గుంటూరు-విజయవాడ హైవేపై పట్టపగలే కారుతో ఢీకొట్టేసాడు (video)
మద్యం తాగి వాహనాన్ని నడపకూడదన్న కనీస ఇంగితజ్ఞానం కూడా కొందరికి వుండటంలేదు. మద్యం సేవించి నడుపుతూ రోడ్లపై ఎంతో జాగ్రత్తగా వెళ్లే ఇతర వాహనదారుల ప్రాణాలను తీసేస్తున్నారు ఇలాంటివారు. ఇలాంటి ఘటనే తాజాగా గుంటూరు-విజయవాడ హైవేపై జరిగినట్లు ఓ కారు నుంచి వీడియో తీసిన వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.
తన కారుని ఓవర్ టేక్ చేసిన సదరు కారు నడుపుతున్న వ్యక్తి, జాతీయ రహదారిపై కారును అడ్డదిడ్డంగా నడుపుతూ వెళ్లాడు. అతడు కారు నడుపుతున్న పరిస్థితి చూస్తే ఖచ్చితంగా అతడు మద్యం సేవించి కారు నడుపుతున్నట్లు అర్థమవుతుంది. ఈ క్రమంలో రెండుమూడుచోట్లు రెప్పపాటులో ప్రమాదం తప్పిపోయింది. కానీ చివరికి వంతెన రావడంతో అకస్మాత్తుగా కారును పక్కకి తిప్పి ఎంతో జాగ్రత్తగా వస్తున్న మరో కారును ఢీకొట్టేసాడు. ఆ వీడియో చూడండి.