శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 అక్టోబరు 2021 (20:09 IST)

లోక్‌సత్తా నేతపై దాడి.. కంట్లో కారం కొట్టి కర్రలతో అటాక్

లోక్‌సత్తా నేతపై దాడి చేసిన సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ లోక్‌సత్తా నేతపై దాడి చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. లోక్‌సత్తా పార్టీకి చెందిన వెంకటరమణ రాయదుర్గంలో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కంట్లో కారం కొట్టి కర్రలతో దాడికి యత్నించారు.
 
దీంతో వెంకటరమణ తన వాహనాన్ని అక్కడే వదిలిపెట్టి సమీపంలో ఉన్న పోలీస్‌ స్టేషన్‌ వైపు పరుగులు తీశారు. వెంకటరమణను దుండగులు ద్విచక్ర వాహనాలపై వెంబడించినట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్‌‌కు చేరుకున్న వెంకటరమణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.