శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , శనివారం, 2 అక్టోబరు 2021 (12:56 IST)

ప్రేమ క‌థా చిత్రం "ఎక్కడికో ఈ అడుగు'

'ఎఫెక్ట్స్ రాజు'గా పరిశ్రమ వర్గాలకు సుపరిచితుడైన రాజు బొనగాని దర్శకత్వంలో... 'స్కై లైన్ ఎంటర్ టైన్మెంట్స్' పతాకంపై తొలి ప్రయత్నంగా అట్లూరి శ్రీనివాస్ నిర్మిస్తున్న విభిన్న ప్రేమకథా చిత్రం "ఎక్కడికో ఈ అడుగు". పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెన్సార్ సన్నాహాల్లో ఉంది. గోపీ కృష్ణ-ప్రియాంక చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నఈ చిత్రంలో ఆర్తి రాజ్, జయప్రకాష్ (తమిళ్), తోటపల్లి మధు, పిల్లా ప్రసాద్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 1990లో జరిగిన ఓ యదార్ధ సంఘటన ఆధారంగా.. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన "ఎక్కడికో ఈ అడుగు" అన్ని వర్గాల ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుందనే నమ్మకం తమకుందని, సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటున్న తమ చిత్రాన్ని నవంబర్ ద్వితీయార్ధంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు రాజు బొనగాని తెలిపారు.
 
నిర్మాత అట్లూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, "చిత్ర నిర్మాణంతోపాటు పోస్ట్ ప్రొడక్షన్ "ఇనావర్స్ స్టూడియో"కు అప్పగించాం. మాకు ప్రామిస్ చేసిన బడ్జెట్ లో... మాకు ప్రామిస్ చేసిన దానికంటే మంచి క్వాలిటీతో పూర్తి చేశారు. ఈ సందర్భంగా "ఇనావర్స్ స్టూడియో"వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం" అన్నారు.
 
    ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ అప్పాజీ, కో-డైరెక్టర్: నాగరాజు, ఆర్ట్: వెంకటేష్ ఆరె, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, సంగీతం: దిలీప్ బండారి, మాటలు: రమన్ లోక్ వర్మ, ఛాయాగ్రహణం: ఈశ్వర్ ఎల్లుమహంతి, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర్రావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: తాతినేని సుజన్ బాబు, నిర్మాత: అట్లూరి శ్రీనివాస్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: రాజు బొనగాని.