శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 23 నవంబరు 2024 (10:57 IST)

పవన్ 'తుఫాన్' ఎఫెక్ట్: మహారాష్ట్రలో అధికారం చేజిక్కించుకుంటున్న Mahayuti కూటమి

pawan kalyan
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బిజెపి నేతృత్వంలోని మహాయుతి కూటమి బంపర్ మెజారిటీతో దూసుకుపోతోంది. ఇక్కడ విదర్భ, ఇతర నియోజకవర్గాల్లో జనసేన చీఫ్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రచారం చేసిన ఎఫెక్ట్ స్పష్టంగా కనబడుతోంది. పవన్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో భాజపా కూటమి అత్యధిక స్థానాల్లో విజయం దిశగా దూసుకువెళుతోంది. ప్రధానమంత్రి మోదీ అన్నట్లు... పవన్ కల్యాణ్ తుఫాన్ ప్రభంజనం మహారాష్ట్రలో కూడా పనిచేసినట్లు తెలుస్తోంది.
 
Maha election reults
మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకే దశ ఎన్నికల పోలింగ్ జరుగగా అధికార మహాయుతి కూటమి - BJP, శివసేన, NCP (అజిత్ పవార్ వర్గం) మ్యాజిక్ ఫిగర్ దాటి 217 స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (MVA)- కాంగ్రెస్, శివసేన(UBT), NCP (శరద్ పవార్ వర్గం) కేవలం 53 స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తోంది. కాగా 2019 ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు 105 విజయం సాధించగా ఇప్పుడు 2024లో ఆ సంఖ్య 122కి చేరుకుంటోంది. ఇది ఖచ్చితంగా పవన్ కల్యాణ్ ప్రభావం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
 
pawan kalyan
ఇంతకుముందే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటించిన నియోజకవర్గాల్లో ఎన్డీయే కూటమికి అత్యధిక స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి. దీన్ని నిజం చేస్తూ పవన్ ప్రభావం ఆ నియోజకవర్గాల్లో వున్నట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద మహారాష్ట్రలో పవన్ ప్రభంజనం స్పష్టంగా కనబడుతోంది.