గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 22 నవంబరు 2024 (10:20 IST)

ఎగ్జిట్ పోల్ ఫలితాలు 2024 : ఆ రెండు రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటే...

maharashtra
మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. శనివారం ఫలితాలు వెల్లడికానున్నాయి. యావత్ దేశం దృష్టిని ఆకర్షించిన ఈ ఎన్నికలు ప్రశాతంగా ముగిశాయి. బీజేపీ సారధ్యంలోని మహాయుతి కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి నువ్వా-నేనా అన్నట్టుగా ఎన్నికల్లో విజయం కోసం పోటీపడ్డాయి. 
 
పోలింగ్ ముగిసిన బుధవారం సాయంత్రం వెలువడిన అత్యధిక ఎగ్జిట్స్ పోల్స్ మహాయుతి కూటమి (బీజేపీ సారథ్యం)కి పట్టం కట్టిన విషయం తెలిసిందే. తాజాగా మరో రెండు ఎగ్జిట్ పోల్ అంచనాలు వెలువడ్డాయి. విశ్వసనీయత కలిగిన యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ గురువారం రాత్రి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ ఫలితాలను విడుదల చేసింది. అసెంబ్లీలో 288 సీట్లు ఉండగా మహాయుతి లేదా కూటమి 178-200 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. మ్యాజిక్ ఫీగర్ 145 మార్క్‌ను సునాయాసంగా సాధిస్తుందని లెక్కగట్టింది. ఇక మహా వికాస్ అఘాడి 82-102 సీట్లకు పరిమితం కావొచ్చని తెలిపింది. 
 
ఇక 'టుడేస్ చాణక్య' కూడా ఎన్డీయేకి పట్టం కట్టింది. ఎన్డీయే 175 సీట్ల వరకు గెలుచుకుంటుందని అంచనా వేసింది. కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, శరద్ పవార్ ఎన్సీపీలతో కూడిన విపక్ష కూటమి 100 సీట్లకు పరిమితం అవుతుందని అంచనా వేసింది. కాగా ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల ప్రకారం మహారాష్ట్రలో 66 శాతం పోలింగ్ నమోదైంది. 2019తో పోల్చితే గణనీయంగా ఓట్ల శాతం పెరిగింది. కాగా పోస్టల్ బ్యాలెట్లను మొత్తం ఓట్ల శాతంలో కలపాల్సి ఉంది.