మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాలు.. ఆధిక్యంలో బీజేపీ.. ట్రెండ్స్ మారితే?
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల లెక్కింపు ప్రారంభమైంది. ఎన్డీయే కూటమి అభ్యర్థులకు ఆరంభంలో స్పష్టమైన ఆధిక్యాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 288 నియోజకవర్గాలు ఉండగా ఉదయం 9.15 గంటల సమయానికి 90 నియోజకవర్గాలకు సంబంధించి తొలి రౌండ్ ఫలితాలు వెలువడగా, బీజేపీ 127, కాంగ్రెస్ 124, ఇతరులు 11 స్థానాల్లో ముందంజలో వున్నారు.
ఇక ఝార్ఖండ్‌లో ఎన్డీయేకి ఆధిక్యం కనిపిస్తోంది. రాష్ట్రంలో మొత్తం 81 స్థానాలు ఉండగా ఉదయం 09.15 గంటలకు 35 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో వుంది. కాంగ్రెస్ 38 చోట్ల, ఇతరులు నాలుగు చోట్ల ముందంజలో వున్నారు.
కాగా తొలి అర్ధ గంటలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉంటుంది. కాబట్టి ట్రెండ్స్ మారే అవకాశాలు లేకపోలేదు. ఇటీవల హర్యానా అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇదే జరిగింది. ఆరంభంలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఆధిక్యం లభించడంతో గెలుపు ఖాయమని అంతా భావించారు. కానీ ఆ తర్వాత అనూహ్యంగా ట్రెండ్స్ మారిపోయి బీజేపీ అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే.