శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: బుధవారం, 31 మార్చి 2021 (22:38 IST)

మోడల్ మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దండి: మేయర్లు, ఛైర్‌పర్సన్‌లకు మంత్రి బొత్స

విజయవాడ: మున్సిపాలిటీలను అన్ని రంగాలలో అభివృద్ది చేసి మోడల్ మున్సిపాలిటీలుగా తీర్చిదిదాలని రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి బొత్స‌ సత్యనారాయణ అన్నారు. ఇటీవల కొత్తగా ఎన్ని కైన నగరపాలక సంస్థ మేయర్లు, మున్సిపల్ ఛైర్‌పర్సన్‌లకు విజ‌య‌వాడ‌లోని “ఎ” కన్వెన్షన్ సెంటర్‌లో రెండు రోజులపాటు అందించినున్న శిక్షణ‌ కార్యక్రమాలను బుధవారం మంత్రి జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి ప్రారంభించారు.

ఈ సందరర్భంగా మంత్రి బొత్స‌ సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు అమలు చేస్తున్న విన్నూత్న సంక్షేమ కార్యక్రమాలకు మద్దత్తుగా మున్సిపల్ ఎన్నికలలో ప్రజలు ఏకపక్షంగా తిరుగులేని తీర్చునిచ్చారన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించి నగరాలు, పట్టణాలను అన్ని అంశాలలో అభివృద్ధి దిశగా తీసుకువెళ్లాల్సిన బాధ్యత నూతనంగా ఎన్ని కైన మేయర్లు, ఛైర్ పర్సన్ల పై ఉందన్నారు.

ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ప్రజలు ప్రభుత్వం పై ఉంచిన నమ్మకాన్ని మరింత పెంచే విధంగా కృషి చేయాలన్నారు. పురపాలన అంటే పరిశుభ్రత ఒక్కటే కాదని ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు, రోడ్లు నిర్మాణం, పార్కులు, పట్టణ సుందరీకరణ, సంపూర్ణ పారిశుద్ధ్యం, డ్రైనేజీ సౌకర్యాలు, వీధి దీపాలు వంటి అన్ని మౌలిక సౌకర్యాలను పూర్తి స్థాయిలో కల్పించి వారి మనస్సులో సుస్థిర స్థానం సంపాదించుకోవాలన్నారు.

దేశంలోనే ఎ క్కడా లేని విధంగా పాలనా వ్యవస్థను ప్రజల గమ్మం వద్దకు తీసుకువెళ్లేందుకు తీసుకువచ్చిన గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థను సమర్ధవంతంగా వినియోగించుకుని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన ప్రతీ ఒక్కరికీ అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఉదయం 6 గంటల నుండే వార్డులలో పర్యటించి, పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించాలని, ప్రజలతో మమేకమై ఎవరూ వేలెత్తి చూపించే వీలు లేకుండా వారి సమస్యలను సావధానంగా విని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.

అధికార యంత్రాంగంతో సమన్వయంతో ప్రజలకు చక్కని పరిపాలనను అందించే దిశగా పనిచేయాలని ఎటువంటి పరిస్థితులలోనూ సహనాన్ని కోల్పోవద్దన్నారు. ప్రజలకు సేవ చేయాలనే తపనతోనే పనిచేయాలన్నారు. మున్సిపల్ చట్టంలోని నిబంధనలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలన్నారు. నగరాలలో ఇద్దరు డిప్యూటీ మేయర్లు, పట్టణాలలో ఇద్దరు వైస్ ఛైర్మన్లు ఉండే విధంగా చట్టంలో మార్పులు తీసుకువచ్చామని, త్వరలో రెండవ డిప్యూటీ మేయర్ , రెండవ వైస్ ఛైర్మన్‌లను ఎంపిక ప్రక్రియ చేపడతామన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళా పక్షపాతి అని మహిళలు అంటే విజయానికి ప్రతీక అని నమ్మిన ముఖ్యమంత్రన్నారు. మహిళలకు స్థానిక ఎన్నికలలో 50 శాతం రిజర్వేషన్ అందించి, నగర మేయర్, మున్సిపల్ చైర్ పర్సన్లలో 50 శాతానికి పైగా మహిళలకు అవకాశం కల్పించారన్నారు. విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌.. 'క్లీన్ ఆంధ్రప్రదేశ్' కార్యక్రమాన్ని జూలై, 8వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో నగరాలు, పట్టణాలను పరిశుభ్రంగా మార్చి రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమన్నారు. ఇందుకోసం 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు.
 
రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి మాట్లాడుతూ నూతనంగా ఎంపికైన నగర మేయర్లు, మున్సిపల్ చైర్ పర్సన్లు ప్రజలకు ఉపయోగపడే మంచి పనులు చేసి పట్టణాలు, నగరాలు అభివృద్ధి దిశగా తీసుకు వెళ్లలన్నారు. పట్టణ ప్రాంతాలలో ప్రజలకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు అందించేలా చూడాలన్నారు. అనధికార లే అవుట్లు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణ ప్రాంతాలలో ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని, నీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు.

పట్టణ ప్రాంతాలలో వాయు కాలుష్యం నియంత్రించి పర్యావరణ పరిరక్షణకు నూతన విధానాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. దేశంలో అన్ని అంశాలలో అత్యుత్తమ ప్రగతిని సాధించిన ఇండోర్, మైసూర్, అంబికాపూర్ వంటి నగరాలు, పట్టణాలను పరిశీలించేందుకుగాను కొత్త గా ఎంపికైన మేయర్లు, ఛైర్ పర్సన్లుగా బృందాలుగా తీసుకు వెళతామన్నారు.

క్లీన్ ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమాన్ని జూలై, 8వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంబించనున్నారని, 2022, జూలై,8వ తేదీ నాటికి ఈ అంశంలో ప్రగతి సాధించిన నగరాలు, పట్టణాలను ఎంపిక చేసి అవార్డులు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంపై ముద్రించిన పోస్టర్లు, బుక్‌లెట్స్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కౌన్సిల్ సమావేశాలు నిర్వహణ, కౌన్సిల్ విధులు, బాధ్యతలు అంశంపై కాకినాడ మున్సిపల్ కమిషనరు స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివ‌రించారు.

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌. కార్యక్రమంలో మున్సిపల్ పరిపాలనా శాఖ కమిషనర్‌, డైరెక్టరు యం.యం.నాయర్, ఏఎఆర్‌డిఎ కమిషనర్‌ లక్ష్మీనరసింహం, మున్సిపల్ పరిపాలనా శాఖ స్పెషల్ సెక్రటరీ వి.రామమనోహరరావు, ఏపి టిడ్కో ఎండీ చిట్టూరి శ్రీధర్, అర్బన్ గ్రీనింగ్ కార్పోరేషన్ ఎండి యన్.చంద్రమోహన్ రెడ్డి, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టరు డి.భరత్ నారాయణగుప్త, ప్రజా ఆరోగ్య శాఖ చీఫ్ ఇంజనీరు వి.చంద్రయ్య, టౌన్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టరు వి.రాముడు, మెప్మా యండి వి.విజయలక్ష్మీ, గృహ నిర్మాణ సంస్థ వైస్ ఛైర్మన్ బి.రాజగోపాల్, స్చచ్ఛసర్వేక్షణ్ యండి సంపత్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్, త‌దిత‌రులు పాల్గొన్నారు.