సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 అక్టోబరు 2021 (11:04 IST)

ప్రేమించి పెళ్లాడాడు.. తీరా గర్భం దాల్చాక పారిపోయాడు..

విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఓ యువకుడు ప్రేమించి పెళ్లాడి తీరా గర్భం దాల్చాక వదిలేసి పారిపోయాడు. దాంతో న్యాయం చేయాలంటూ ఆ యువతి నిరసనకు దిగింది. వివరాల్లోకి వెళితే… డైలీ మార్కెట్ ప్రాంతానికి చెందిన నర్రు వందన అనే యువతి అదే ప్రాంతానికి చెందిన తన ఇంటిముందు యువకుడు నర్రు చినబాబుతో ప్రేమలో పడింది. 
 
రెండేళ్లుగా చినబాబు ప్రేమిస్తున్నా అంటూ వెంటపడుతున్నా అని చెప్పడంతో అతడి మాయమాటలకు లొంగిపోయింది. ఆ తరవాత యువతి గర్భం దాల్చడంతో తక్కువ కులం అంటూ సాకు చెప్పి పెళ్లికి నిరాకరించాడు.
 
దాంతో యువతి పెద్దలతో కలిసి నిలదీసింది. జూన్ 20 న ఇద్దరికీ పెద్దలు గుడిలో వివాహం జరిపించారు. పెళ్లి తరవాత యువకుడి తల్లిదండ్రులు ఇంట్లోకి రానివ్వకపోవడంతో ఇద్దరూ యువతి అన్న ఇంటివద్ద నివాసం ఉన్నారు. 
 
అయితే జూన్ 30నుండి చినబాబు కనిపించకుండా పోయాడు. దాంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.