శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 నవంబరు 2021 (15:07 IST)

కరోనా రాదని... పాలలో నల్ల ఉప్పు వేసుకుని తాగి.. యువకుడి మృతి

కరోనా రాకుండా ఉండేందుకు చిట్కా పాటించి ఓ యువకుడు చనిపోగా, ఇద్దరు కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో ట్రీట్​మెంట్​ తీసుకుంటున్న ఘటన హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మచ్చ బొల్లారం పరిధి చంద్రనగర్ కాలనీకి చెందిన సురేశ్​(30) ప్రైవేటు ఎంప్లాయ్​. పాలలో నల్ల ఉప్పు వేసుకుని తాగితే కరోనా రాదని ఇరుగు పొరుగు ఇచ్చిన సలహాతో సురేశ్​తో పాటు అతని భార్య సంధ్య, తల్లి లక్ష్మి కొంతకాలంగా పాటిస్తున్నారు. 
 
మంగళవారం రాత్రి కూడా వారు పాలలో నల్ల ఉప్పు వేసుకొని తాగారు. కొద్దిసేపటికి ముగ్గురు వాంతులు చేసుకోగా సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. సురేశ్ కండీషన్ ​సీరియస్​గా ఉండగా గాంధీ ఆస్పత్రికి తరలించగా ట్రీట్​మెంట్​ తీసుకుంటూ శుక్రవారం చనిపోయాడు. అతని భార్య, తల్లి ట్రీట్​మెంట్​తీసుకుంటున్నారు. కుటుంబసభ్యుల కంప్లయింట్​తో అల్వాల్ పోలీసులు కేసు ఫైల్​ చేశారు.