శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 10 జనవరి 2017 (10:46 IST)

భార్యను గొడ్డలితో అతికిరాతకంగా నరికి చంపి.. తానూ తనువు చాలించిన భర్త

కడప జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి ఆవేశం భార్య నిండు ప్రాణాలు తీసింది. ఆ తర్వాత తాను చేసిన తప్పు తెలుసుకుని తనుకూడా తనువు చాలించాడు ఆ భర్త. మరోవైపు తల్లిదండ్రులను కోల్పోయిన వారి బిడ్డ ఇపుడు అనాథగ

కడప జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి ఆవేశం భార్య నిండు ప్రాణాలు తీసింది. ఆ తర్వాత తాను చేసిన తప్పు తెలుసుకుని తనుకూడా తనువు చాలించాడు ఆ భర్త. మరోవైపు తల్లిదండ్రులను కోల్పోయిన వారి బిడ్డ ఇపుడు అనాథగా మారిపోయింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కడప జిల్లా వేముల మండలం నల్లచెరవుపల్లిలో రామాంజనేయులు అతని భార్య కవిత దంపతులు కూలి పని చేస్తూ జీవనం కొనసాగిస్తూ వచ్చారు. కొంతకాలంగా కవితపై అనుమానం పెంచుకున్న రామాంజనేయులు ఆమెను వేధించసాగాడు. ఈ క్రమంలో మంగళవారం పీకల వరకు మద్యం సేవించి వచ్చిన ఆయన... తెల్లవారుజామున ఆమెను గొడ్డలితో దారుణంగా నరికి చంపాడు. 
 
అనంతరం తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో వారి ఒక్కగానొక్క కుమారుడు అనాథగా మారాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థాలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.