శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 13 జులై 2017 (08:22 IST)

ఇంటికి బంధువులొచ్చినా అనుమానమే.. కట్టుకున్న భార్యనే పొడిచి పడేశాడు

భర్త తిరుపతికి వెళ్లిన సమయంలో యాదృచ్ఛికంగా భార్య తరపు బంధువులు ఆమె ఇంటికి వచ్చారు. అదే మహాపరాధమై ఆమెను భర్త, భర్తవైపు బంధువులు కాల్చుకుతిన్నారు. అందరిముందు పరువు తీశారు. అంతటితో అనుమానం పోక, ఆమెను సొంత భర్త, బావే బుధవారం దారుణంగా పొడిచి హత్య చేశారు.

భర్త తిరుపతికి వెళ్లిన సమయంలో యాదృచ్ఛికంగా భార్య తరపు బంధువులు ఆమె ఇంటికి వచ్చారు. అదే మహాపరాధమై ఆమెను భర్త, భర్తవైపు బంధువులు కాల్చుకుతిన్నారు. అందరిముందు పరువు తీశారు. అంతటితో అనుమానం పోక, ఆమెను సొంత భర్త, బావే బుధవారం దారుణంగా పొడిచి హత్య చేశారు. భర్తవైపు బంధువులు ఎవరొచ్చినా భార్యకు మాత్రం అనుమానం కలగకూడదు కానీ భార్యవైపు బంధువులు వస్తే మాత్రం ఆమె వేరే సంబంధాల్లోకి వెళ్లినట్లే అనుమానాలు.. ఆపై హత్యలు కూడా జరిగిపోతాయి. 2000 బిసీ కాదు 2017లో భారత దేశంలో కుటుంబ వ్యవస్థ ఉన్న తీరు ఇది. 
 
అనుమానమే పెనుభూతమైన క్షణంలో జీవితాంతం తోడుంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన భర్తే ఆమెను కిరాతకంగా హత్య చేశాడు. బుధవారం సాయంత్రం మాధవనగర్‌లోని శివరామాలయం వెనుక వీధిలో పల్లవి (25) అనే వివాహిత దారుణహత్యకు గురైంది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం సీపీ సముద్రం గ్రామానికి చెందిన ఉమాదేవి, చంద్ర మౌళీశ్వరుల ఏకైక కుమార్తె పల్లవితో 2010లో పాములపాడు మండలం మిట్టకందాల గ్రామానికి చెందిన లక్ష్మిదేవి కుమారుడు పురోహితుడైన చంద్రమోహన్‌కు వివాహమైంది. 
 
ఏకైక కుమార్తె కావడంతో ఆమె విడిచి ఉండలేక  తండ్రి.. జొహరాపురంలో పౌరోహిత్యం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాధవనగర్‌లో కాపురం పెట్టిన చంద్రమోహన్, పల్లవి దంపతులు ఏడేళ్ల పాటు కుటుంబాన్ని సజావుగా సాగించారు. చంద్రమోహన్‌ తల్లి లక్ష్మిదేవి కూడా వీరితో పాటే కలిసి ఉంది.  
 
జూన్‌ 26న జరిగిన సంఘటనను పల్లవి భర్త చంద్రమోహన్‌కు తెలియజేశారు. నాటి నుంచి అనుమానం పెంచుకున్న భర్త, అతని బావ తరచూ పల్లవిని వేధింపులకు గురి చేసేవారు. ఒకానొక సమయంలో కాల్చి వాతలు కూడా పెట్టారని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఒంటరిగా ఉన్న పల్లవిని భర్త, అతని బావ దారుణంగా హత్య చేసి పరారయ్యారని మృతురాలి తల్లిదండ్రులు ఉమాదేవి, చంద్రమౌళీశ్వర్‌లు పోలీసుల ముందు వాపోయారు. మృతురాలికి కుమార్తె ఆరాధ్య, కుమారుడు కౌషిక్‌లు ఉన్నారు.     
 
గత నెల 26న చంద్రమోహన్‌ మొక్కు తీర్చుకునేందుకు తిరుపతికి వెళ్లాడు. అదే రోజు రాత్రి పల్లవి తల్లితో పాటు ఆమె బంధువులు ఇంటికొచ్చారు. అదే సమయంలో చంద్రమోహన్‌ తల్లి లక్ష్మిదేవి పెద్దమార్కెట్‌ వద్ద ఉన్న తన కుమార్తె వసుంధర వద్దకు పిల్లల్ని తీసుకెళ్లింది. ఒకేరోజు తల్లీపిల్లలు ఇంటికి రావడంతో అనుమానం వచ్చిన వసుంధర, ఆమె భర్త శేఖర్‌.. చంద్రమోహన్‌ ఇంటి వద్దకు వచ్చి తలుపు తట్టారు. ఇంట్లో పల్లవి తన బంధువులతో ఉన్న దృశ్యాలను చూసిన వసుంధర, శేఖర్‌లు తమ అమ్మను, పిల్లల్ని బయటకు పంపించి మీ బంధువులతో ఏం చేస్తున్నావంటూ దాడికి దిగారు. ఇరుగుపొరుగు వారు వచ్చి వారించడంతో ఆ రాత్రికి గొడవ సద్దుమణిగింది.
 
మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సీఐ శ్రీనివాసరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు.