శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 20 జనవరి 2022 (17:41 IST)

పాస్టర్ ను అవమానించిన మంగళగిరి రూరల్ ఎస్సై; జ‌ర్న‌లిస్ట్ బైక్ సీజ్

సిక్స్ టీవీ మంగళగిరి రిపోర్టర్ కిషోర్ కు చెందిన ద్విచక్ర వాహనాన్ని రూరల్ ఎస్సై లోకేష్ సీజ్ చేయటాన్ని నిరశిస్తూ గురువారం ప్రెస్ క్లబ్ మంగళగిరి  జర్నలిస్టులు రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. విలేఖరులపై పోలీసుల దౌర్జన్యం నశించాలి... ఎస్సై లోకేష్ డౌన్ డౌన్ అంటూ, నినాదాలు చేశారు. 
 
 
ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ, కోవిడ్ సమయంలో ఆరోగ్యాన్ని పణంగా పెట్టి జర్నలిస్టులు నిస్వార్థంగా విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ నేపధ్యంలో గురువారం రాత్రి రూరల్ ఎస్సై లోకేష్ ఓ పాస్టర్ ను అడ్డుకొని అవమానించేలా మాట్లాడారని, ఆ దేవుడే మిమ్మల్ని కాపాడతాడు అంటూ వ్యంగ్యంగా మాట్లాడారని అన్నారు. అదేమని అడిగినందుకు సిక్స్ టీవీ రిపోర్టర్ బైక్ ను లాక్కొని దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. మొదట్నుంచీ ఆయన వైఖరి వివాదాస్పదంగా ఉందని అన్నారు.ఎస్సై లోకేష్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
 
 
కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను అమలు చేస్తోంద‌ని, అయితే  అత్యవసర సేవల కింద మీడియాకు మినహాయింపు ఉందని మంగళగిరి డి.ఎస్.పి రాంబాబు అన్నారు. సిక్స్ టీవీ రిపోర్టర్ పట్ల ఎస్ఐ లోకేష్ ప్రవర్తించిన తీరు సరికాదని, ఈ తరహా ఘటన లో భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూస్తానని హామీ ఇచ్చారు.  ప్రెస్, పోలీస్ కలిసి పని చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని అన్నారు.


ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ మంగళగిరి అసోసియేషన్ అధ్యక్షులు ఐ.వెంకటేశ్వర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి బి.దయాకర్, కోశాధికారి సిహెచ్ రామకృష్ణ జర్నలిస్టులు వి  బ్రహ్మనాయుడు,కృష్ణ ప్రసాద్,కె మురళి రాజు,బి శ్రీనివాసరావు,ఎం కృష్ణ,బి సాంబశివరావు, ఎస్ కె సుబాని,సురేష్,డి రాము,ఎ ప్రభాకర్,జీవై సాయి కృష్ణ, శ్రీకాంత్,మధు,ఎస్ శ్రీనివాసరావు,రాంబాబు, శివన్నారాయన, శ్రీహరి, హనుమంతరావు, సాయి చంద్  తదితరులు పాల్గొన్నారు.