శనివారం, 16 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 15 డిశెంబరు 2021 (13:04 IST)

కొత్త స‌ర్పంచుల‌కు తెలియ‌కుండా ఆర్ధిక సంఘం నిధులు వాడేశారు...

కృష్ణా జిల్లా నూజివీడు మండలం రావిచర్ల గ్రామపంచాయతీ ముందు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సర్పంచ్ కాపా శ్రీనివాసరావు నిరసన దీక్ష చేపట్టారు. కొత్తగా గ్రామ సర్పంచులుగా ఎన్నిక‌యిన  సర్పంచులకు తెలియకుండా గ్రామపంచాయతీ 14, 15 ఆర్ధిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్నందుకు నిరసన దీక్ష చేపట్టారు.

 
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలకు జమ చేయాల‌ని డిమాండు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుండి గ్రామపంచాయతీలు రావాల్సిన నిధులను నేరుగా గ్రామపంచాయతీ అకౌంట్లో జమ చేయాల‌ని కోరారు. కొత్తగా బ్యాంక్ అకౌంట్ లో గ్రామ సర్పంచ్ ఒక్కరికే చెక్ పవర్ కల్పించాలని టిడిపి నాయకులు డిమాండ్ చేశారు.  

 
గ్రామ పంచాయతీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు కేటాయించాల‌ని, గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నగదు కూడా వెంటనే విడుదల చేయాల‌ని కోరారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రావిచర్ల గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రావు డిమాండ్ చేశారు.