1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 నవంబరు 2021 (14:21 IST)

ఉపరాష్ట్రపతి వెంకయ్య రాష్ట్రపతి స్థాయికి ఎదగాలి.. చిరంజీవి

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాష్ట్రపతి స్థాయికి ఎదగాలని తాను కోరుకుంటున్నట్లు మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇది ప్రతి తెలుగు వారి కోరిక అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రపతిగా ఉన్న రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం వచ్చే సంవత్సరం జులై నాటికి పూర్తి కానున్న నేపథ్యంలో వెంకయ్యపై చిరు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారింది.
 
2017లో భారత ప్రథమ పౌరుడిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. బుధవారం అమీర్ పేటలో యోధ డయోగ్నస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవానికి చిరు, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. అయ్యప్ప స్వామి సాక్షిగా వెంకయ్యనాయుడు భారత రాష్ట్రపతి కావాలి. ఉపరాష్ట్రపతిగా ఆయన దేశానికి చాలా సేవ చేశారన్నారు.
 
అనంతరం మాట్లాడిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. చిరంజీవి కామెంట్స్‌పై స్పందించారు. తనకు రాష్ట్రపతి పదవి ఇవ్వాలని ఎవరూ ప్రతిపాదించలేదన్నారు. అయితే.. అందరి మనసులో ఉన్న విషయమే చిరంజీవి చెప్పారన్నారు వెంకయ్యనాయుడు. ఇదే సమయంలో రాజకీయాలపైనా కీలక కామెంట్స్‌ చేశారు వెంకయ్యనాయుడు. రాజకీయాలపై ఆసక్తి తగ్గిపోయిందన్నారు. చిరంజీవి రాజకీయాలు మానుకొని మంచి పనిచేశారంటూ కితాబిచ్చారు.