శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 16 నవంబరు 2021 (18:05 IST)

కాజ‌ల్‌కు భ‌ర్త రూపంలో వార‌స‌త్వం వ‌చ్చేస్తుంది (video)

Kajal Agarwal. Gautam Kichlu
సినిమా రంగంలో హీరోల కొడుకులు హీరోలు, లేక వారి అమ్మాయిలు న‌టీమ‌ణులుగా చ‌లామ‌ణి అవ‌డం మామూలే. ఇక‌ హీరోయిన్ల నుంచి వార‌స‌త్వంగా రావ‌డం కూడా జ‌రుగుతోంది. కొంద‌రు హారోయిన్ల చెల్లెల్లు కూడా న‌టీమ‌ణులుగా వ‌చ్చేస్తున్నారు. అదే కోవ‌లో భ‌ర్త‌లు కూడా వ‌చ్చేస్తున్నారు. చిరంజీవి, కృష్ణ, స్నేహ కుటుంబంలోని వారి భ‌ర్త‌లు న‌టులుగా మార‌డం తెలిసిందే.
 
తాజాగా కాజ‌ల్ అగ‌ర్వాల్ భ‌ర్త గౌత‌మ్ కిచ్లూ కూడా న‌టుడిగా మారాల‌ని చూస్తున్నాడు. ఇందుకు రంగం కూడా సిద్ధ‌మైంది. కాజ‌ల్ పెండ్లి చేసుకున్నాక మెగాస్టార్ చిరంజీవి సినిమా `ఆచార్య‌`లో క‌రోనా త‌ర్వాత న‌టించేట‌ప్పుడు చిరంజీవికి బోకే ఇచ్చి ఆశీస్సులు పొందారు. త‌న చిన్న‌నాటి స్నేహితుడు, న‌ట‌న‌లో నాకు సూచ‌న‌లు, విమ‌ర్శ‌లు చేసే తొలి వ్య‌క్తి అని చిరుకు తెలియ‌జేసింది కూడా. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం చిరు చేయ‌బోతున్న మూడు సినిమాల్లో ఓ చిత్రంలో ఓ పాత్ర వేయ‌డానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకు చిరు కూడా పాజిటివ్ గా స్పందించిన‌ట్లు తెలుస్తోంది. సో. కొద్దిరోజుల్లో కాజ‌ల్ భ‌ర్తను కూడా సినిమాల్లో చూడ‌బోతున్నార‌న్న‌మాట‌. ఇప్ప‌టికే కాజ‌ల్ గ‌ర్భ‌వ‌తి అని ప్ర‌చారం వుంది.