శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 26 మే 2021 (11:25 IST)

#చిరంజీవి మిషన్ మొదలైంది : గుంటూరులో తొలి ఆక్సిజన్ బ్యాంకు

కరోనా కష్టకాల్లో ఆక్సిజన్ కొరత కారణంగా అనేక మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి వారిని రక్షించేందుకు మెగాస్టార్ చిరంజీవి నడుం బిగించారు. ఈ ప‌రిస్థితుల‌ని గ‌మ‌నించిన చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల‌లో ఆక్సిజ‌న్ బ్యాంకులు ఏర్పాటు చేసి అవ‌స‌రం ఉన్న వారికి ఉచితంగా ఆక్సిజ‌న్ అందించాల‌ని భావించారు. 
 
ఇప్ప‌టికే క‌ర్ణాట‌క‌లో చిరు అభిమానులు ఆక్సిజ‌న్ బ్యాంక్ స్టార్ట్ చేయ‌గా తొలిసారి గుంటూరు జిల్లాలో ఆక్సిజ‌న్ సిలిండ‌ర్స్‌ని అందుబాటులోకి తేనున్నారు. ఆక్సిజ‌న్ బ్యాంక్ ప‌నుల్ని చిరంజీవి త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నార‌ట‌.
 
ఇక ఆయా ప్రాంతాల‌లో చిరంజీవి అభిమాన సంఘాల సీనియర్ అధ్యక్షులే ఎక్కడికక్కడ ఈ బ్యాంక్స్ ఏర్పాటు బాధ్యతలను చూసుకుంటున్నారు. చిరంజీవి అండ‌గా మెగా అభిమానులు సైతం మ‌హ‌త్త‌ర కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం, త‌మ వంతు విరాళాలు అందించ‌డం గొప్ప విష‌యం అనే చెప్ప‌వ‌చ్చు.