బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (20:27 IST)

టీచర్స్ డే, ఉపాధ్యాయిల సహాకారంతోనే ప్రగతిశీల సమాజం: ఏపి గవర్నర్

ఉపాధ్యాయులు సమాజం యొక్క వాస్తుశిల్పులని, భారతావని నిర్మాణంలో వారి భూమిక ఎంచదగినదని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఉపాధ్యాయిల సహకారం లేకుండా ఏ సమాజం ప్రగతిశీల మార్గంలో పయనించలేదని పేర్కొన్నారు.
 
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గవర్నర్ శ్రీ హరిచందన్ ఒక సందేశంలో రాష్ట్రంలోని ఉపాధ్యాయ సమాజానికి తన శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా, భారత రెండవ రాష్ట్రపతిగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశానికి అందించిన సేవలకు గౌరవార్థంగా, ఆయన జన్మదినమైన సెప్టెంబర్ 5ను ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నామని గౌరవ బిశ్వ భూషణ్ ప్రస్తుతించారు.
 
డాక్టర్ రాధాకృష్ణన్ ఆదర్శవంతమైన విద్యావేత్త, పండితునిగానే కాక తత్వవేత్తగా, రచయితగా భారతదేశానికి సేవలు అందించారన్నారు. సర్వేపల్లి తన జీవితంలో ఉన్నత నైతిక విలువలకు కట్టుబడిన మహనీయిడని  ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కొనియాడారు. ఈ మేరకు రాజ్ భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది.