శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 6 జనవరి 2017 (10:35 IST)

రోజా.. నోరు అదుపులో పెట్టుకో.. దురుసుతనం తగ్గించుకో.. లేదంటే... టీడీపీ వార్నింగ్

టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మతిభ్రమించిందని, బీపీ పెరిగిపోయిందంటూ ఘాటైన విమర్శలు చేసిన వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజాకు టీడీపీ కౌంటర్ ఇచ్చింది.

టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మతిభ్రమించిందని, బీపీ పెరిగిపోయిందంటూ ఘాటైన విమర్శలు చేసిన వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజాకు టీడీపీ కౌంటర్ ఇచ్చింది. ఇదే అంశంపై చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు మాట్లాడుతూ.... ఉనికిని కాపాడుకోవడానికి నగరి ఎమ్మెల్యే రోజా ముఖ్యమంత్రి విమర్శిస్తోందని, నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుక్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 
 
రోజా నోటి దురుసువల్లే అసెంబ్లీలో సస్పెండ్‌ అయిందన్నారు. కోర్టుకు వెళ్లినా న్యాయమే గెలవడంతో ఆమె స్పీకర్‌కు క్షమాపణ చెప్పిన విషయం మరచినట్టుందని ఎద్దేవా చేశారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను రాయలసీమకు తీసుకువస్తుంటే ఉభయ గోదావరి, కృష్ణా వాసులను వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదా? అని ప్రశ్నించారు.
 
రాయలసీమకొచ్చి పట్టిసీమ నీళ్లు రావని ఇక్కడి ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగిస్తూ జగన్ రెండు నాలుకల దోరణి ప్రదర్శిస్తున్నాడని దుయ్యబట్టారు. చంద్రబాబును రాయలసీమ ద్రోహి అవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 470 కోట్లతో ప్రారంభించిన సుజల స్రవంతి కాలువ పనులు 85 శాతం పూర్తయ్యాయని ఈ కాలువ ద్వారా కుప్పానికి నీటి సమస్య తీర్చనున్నామని ఆయన తెలిపారు.