శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 ఏప్రియల్ 2024 (15:00 IST)

ఎస్‌బీఐ పురంలో మంత్రి రోజాకు చేదు అనుభవం

rk roja
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకులు జోరుగా గ్రామాల్లో పర్యటిస్తూ, పగలు, రాత్రి విశ్రాంతి లేకుండా ప్రచారం చేస్తూ, ఇంటింటికి తిరుగుతూ తమ పార్టీకి ఓట్లు అడుగుతున్నారు. అలాంటి ప్రచారంలో భాగంగా బుధవారం రాత్రి నగరి ఎమ్మెల్యే మంత్రి రోజాకు చేదు అనుభవం ఎదురైంది. పుత్తూరు మండలంలో ప్రత్యేకించి ఎస్‌బీఐ పురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమెకు స్థానిక ఎస్సీ వర్గీయుల నుంచి వ్యతిరేకత ఎదురైంది.
 
గతంలో తమపై ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదంటూ స్థానికులు మంత్రి రోజాను అడ్డుకున్నారు. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆమెను ముందుకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. పరిస్థితిని పరిష్కరించేందుకు ప్రయత్నించినప్పటికీ, నివాసితులు అంగీకరించకపోవడంతో మంత్రి రోజా తన ప్రచార కార్యక్రమాలను పూర్తి చేయకుండానే వెనుదిరగడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది.