ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 మే 2022 (06:55 IST)

జీడిపండ్ల పేరుతో అనకాపల్లిలో 8 యేళ్ల బాలికపై అత్యాచారం

rape demo
ఏపీలోని అనకాపల్లిలో జీడిపండ్లు పేరుతో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఈ దారుణానికి పాల్పడింది కూడా ఓ మైనర్ బాలుడే కావడం గమనార్హం. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం బెన్నవోలు గ్రామంలో జరిగింది. 
 
ఈ గ్రామానికి చెందిన17 యేళ్ల బాలుడు తమ ఇంటి పక్కనే ఉండే 8 యేళ్ళ బాలికకు మాయమాటలు చెప్పి.. జీడిపండ్లు ఏరుకుందామని ఆ తోటలోకి తీసుకెళ్లాడు. అక్కడకు వెళ్ళిన తర్వాత నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఈ దాడి తర్వాత ఆ బాలిక ఏడుస్తూ ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాధిత బాలిక తల్లిదండ్రులు ఆ యువకుడిని నిలదీయగా పొంతనలేని సమాధానాలు చెప్పారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.