గ్రామానికో ప్రత్యేక ప్యాకేజీ : మాజీ మంత్రి హరీష్ రావు
సిద్దిపేట రూరల్ మండలం సీతారాంపల్లి గ్రామంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరిశ్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా
గ్రామ అభివృద్ధిపై గ్రామస్తులు అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న వారం రోజుల్లో గ్రామంలో భూ సమస్యలు అధికారులుపరిష్కరిస్తారు. న్యాయంగా ధర్మంగా పంచనామా చేసి పట్టా పాసు బుక్కులు రైతులకు అంద చేస్తారు.
రైతులందరు తమ భూసమస్యలు పరిష్కరించుకోవాలి. సీతరాంపల్లి గ్రామన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాను. నేను కోరేది ఒక్కటే గ్రామస్తులు అందరూ ఐక్యంతో ఉండాలి. ఎర్రవెల్లి గ్రామం లాగా అన్ని విధాలుగా గ్రామం అభివృద్ధి కావాలి. గ్రామంలో పెద్దలు, యువత అభివృద్ధిలోబాగస్వామ్యం కావాలి. గ్రామానికి ప్రత్యేక ప్యాకేజి ఉంది. ఆదర్శ గ్రామంగా అభివృద్ధి కావాలి.
లేని అబద్దాలు నమ్మొద్దు అందరూ కలసి మెలసి ఉండాలి. గ్రామంలో అధికారులు అందుబాటులో ఉంటారు. గ్రామ అభివృద్ధి ఒక యజ్ఞం లాగా పనులు పూర్తి చేయాలి. త్వరలో గోదావరి నీరు ఈ ప్రాంతానికి వస్తాయి. ప్రతి ఏటా రెండు పంటలు పండుతాయి. మిల్క్ పీలింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకుందాం. డైరీ ఫాములను, నాటు కోడిఫామ్లని ఏర్పాటు చేస్తే బాగుంటది. ఆర్థికంగా, ఎదురు చూడకుండా స్థిరపడాలి.
సీఎం కేసీఆర్ పేరు నిలబెట్టాలి. జీవనోఫాధికి వరి నాట్లు వేసే, వరి కోసే యంత్రాలు కూడా ఉన్నాయి. గ్రామస్తలందరికి న్యాయం జరగాలని నా కోరిక. తెలిసిన పని చేసుకుంటే బాగుంటది. తెలియని దాని జోలికి వెళ్లొద్దు. ఇబ్బంది పడొద్దు. గ్రామం బాగుండాలని అందరూ కోరుకోవాలి. ఐక్యమత్యంతో మెలగాలి అభివృద్ధిలో ముందుకెళ్లాలి. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలి. గ్రామ యువత వారానికి ఒక రోజు శ్రమ దానం చేయాలి. గ్రామంలో ప్రతి ఇంట్లో మొక్కలు నాటాలి. గ్రామంలోకి అధికారులు వస్తారు. మీరు అందరూ కలసి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాలి.
వారం రోజుల్లో గ్రామం లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తాం అందరి హెల్త్ ప్రొఫైల్ తయారు చేస్తాం. అన్‌లైన్లో పొందుపరుస్తాం. గుండె జబ్బు, క్యాన్సర్ లాంటి పెద్ద వ్యాధిగ్రస్తులు ఉంటే వారికి మెరుగైన చికిత్స అందిస్తాం. యువత కోసం జిమ్, లైబ్రరీ, మహిళల కోసం మహిళ భవన్, ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసుకుందాం. గ్రామంలో చక్కటి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, గ్రామ పంచాయతీ, అంగన్ వాడి బిల్డింగ్ నిర్మించుకొందాం. సీఎం కేసీఆర్ గ్రామానికి ఇచ్చిన గొప్పవరం.. గ్రామాన్ని అభివృద్ధి పర్చుకుందాం అంటూ గ్రామస్థులకు హరీష్ రావు పిలుపునిచ్చారు.